E-Paper
Advertisement

ఛార్జర్లతో పనే లేదు..3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే పవర్‌ఫుల్ ఫోన్లు!

ఛార్జర్లతో పనే లేదు..3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే పవర్‌ఫుల్ ఫోన్లు!
Advertisement

10000mah battery phones: స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘బ్యాటరీ డ్రైనేజ్’. ఉదయం పూట ఫుల్ ఛార్జ్ చేసుకున్న.. ఫోన్, ఆఫీస్ పనులు, సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియో కాల్స్ ,గేమింగ్ కారణంగా సాయంత్రానికే అయిపోవడం సర్వసాధారణమైపోయింది. దీంతో ఎప్పుడూ పవర్‌ బ్యాంక్ లేదా ఛార్జర్ వెంట బెట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ మొబైల్ బ్రాండ్లు ఇప్పుడు ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీలతో.. కూడిన స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఈ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..

10,000mAh బ్యాటరీ ఫోన్ల ప్రత్యేకతలు:

సాధారణంగా మనం వాడే స్మార్ట్‌ఫోన్‌లలో 4,000mAh లేదా 5,000mAh బ్యాటరీలు ఉంటాయి. కానీ ఈ లేటెస్ట్ ఫోన్‌లు రెండు రెట్లు అధికంగా 10,000mAh పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్నాయి. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంతో ఈ ఫోన్‌లు ఈజీగా 2 నుంచి 3 రోజుల పాటు నాన్‌ స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. దీని వల్ల ప్రయాణాలు చేసే టప్పుడు లేదా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఛార్జింగ్ గురించిన టెన్షనే ఉండదు. అంతే కాకుండా..ఈ భారీ బ్యాటరీలను వేగంగా ఛార్జ్ చేయడానికి 80W నుంచి 100W వరకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది.

సేల్‌లో లభించే టాప్ మోడల్స్, ధరల వివరాలు:

Advertisement

Realme P4 Power 5G / Narzo Power: పవర్ ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తున్న.. ఈ ఫోన్ మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 10,001mAh బ్యాటరీ , 80W అల్ట్రా ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న.. ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 24,662 నుంచి రూ. 29,999 వరకు ఉంది. సేల్స్‌లో దీనిపై బ్యాంక్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

Poco X8 Power 5G: స్నాప్‌డ్రాగన్ 6 Gen 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇది కేవలం నిమిషాల్లో.. ఛార్జ్ అవుతుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 30,999 నుంచి రూ.35,999 మధ్య ఉంది.

Advertisement

ALSO READ: సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

Redmi Note 17 Pro Max: షావోమి నుంచి వచ్చిన ఈ ప్రీమియం మోడల్ 10,000mAh బ్యాటరీతో పాటు అద్భుతమైన కెమెరా, 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సేల్స్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూ. 49,998 వద్ద ట్రెండ్ అవుతోంది.

పనితీరు,డిస్‌ప్లే:

కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా.. ఈ ఫోన్‌లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పెద్ద అమోలెడ్ డిస్‌ప్లేలు వీడియోలు .. చూసేటప్పుడు అద్భుతమైన విజువల్ ఫీల్ అందిస్తాయి. మల్టీటాస్కింగ్ కోసం 8GB, 12GB RAM ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 5G కనెక్టివిటీ సపోర్ట్ ఉండడం వల్ల హై-స్పీడ్ ఇంటర్నెట్ వాడకం కూడా ఈజీగా సాగుతుంది.

రోజంతా ఛార్జింగ్ పెట్టే.. శ్రమ నుంచి శాశ్వత విముక్తి పొందాలనుకునే.. వారికి అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో లభిస్తున్న 10,000mAh బ్యాటరీ ఫోన్‌లు చక్కటి అవకాశం. మీ బడ్జెట్ , అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకుని ఈ సేల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి!

Related News

కోడాక్ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ విడుదల..రేట్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు

ఫేస్‌బుక్ ఈమెయిల్ అడ్రస్ మార్చడం ఎలా? సింపుల్ స్టెప్స్ ఇవే!

5-స్టార్ ఏసీ కొన్నా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్‌ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!

ఆర్కుట్ రీఎంట్రీ.. పుష్కర కాలం తర్వాత మళ్లీ, ఫేస్‌బుక్-ఎక్స్ ఆధిపత్యానికి బ్రేక్?

ఇంట్లోనే కెఫే లాంటి కాఫీ రావాలా? రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ కాఫీ మెషిన్స్ ఇవే!

బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్

Big Stories

Advertisement
×