DY Chandrachud : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన సర్వీసులో చివరి రోజు కావడంతో సుప్రీం ధర్మాసనం చంద్రచూడ్ కు వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి.. రేపటి నుంచి తీర్పులు ఇవ్వలేనని గుర్తు చేసుకున్న చంద్రచూడ్.. అయినా, తాన వృతిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నానని వెల్లడించారు.
చంద్రచూడ్ వీడ్కోలుకు సమావేశమైన సుప్రీం ధర్మాసనం.. ఆయన సేవల్ని కొనియాడింది. ఇన్నేళ్ల తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మనమంతా ఇక్కడికి కొన్ని రోజుల పాటు ఉండేందుకు వచ్చిన ప్రయాణికులమని, కానీ.. ఆ వ్యవధిలోనే చేసే పనిలో మనదైన ముద్రవేయాలని పిలుపునిచ్చారు. నేను లేకుంటే కోర్టు లేదనే భావనలోకి ఎవరూ వెళ్లవద్దని జూనియర్లకు మార్గనిర్దేశం చేసిన చంద్రచూడ్.. గతంలోనూ ఎంతో మంది గొప్పవారు ఇక్కడ పనిచేసి వారి వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించి వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు తానూ.. అలానే.. తన తర్వాతి వారికి బాధ్యతలు అప్పగించి వెళుతున్నట్లు తెలిపారు.
సీజేఐ డీవై చంద్రచూడ్ తర్వాత.. నవంబర్ 11న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన చాలా సమర్థవంతుడని కితాబిచ్చిన చంద్రచూడ్.. తన బాధ్యతల్ని సరిగానే నిర్వర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను అక్కడి నుంచి వెళ్లడం వల్ల కోర్టు విధుల్లో చిన్నపాటి మార్పులు కూడా రావన్న చంద్రచూడ్.. ప్రత్యేకించి నా తర్వాత ఉన్న వ్యక్తి చాలా స్థిరంగా, చాలా దృఢంగా ఉన్నాడని తెలుసంటూ.. సంజీవ్ ఖన్నాను ప్రశంసించారు. జస్టిస్ ఖన్నా, చాలా గౌరవప్రదమైన, చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని తెలిపారు.
CJI చంద్రచూడ్ కి బార్ కౌన్సిల్ నుంచి ఘటనమైన వీడ్కోలు లభించింది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ వెంకట రమణి, SCBA ప్రెసిడెంట్ కపిల్ సిబల్ సహా జూనియర్ లాయర్లతో పాటు పరిపాలన, న్యాయ రంగాల్లోని వ్యక్తులు హాజరయ్యారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ సేవల్ని వీడ్కోలు సభలో పాల్గొన్న వారు కొనియారు. మహిళా న్యాయవాదులను సమానంగా చూసేందుకు CJI చేసిన కృషిని ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలమైన కోర్ట్‌రూమ్ కార్యక్రమాలు, ఆన్‌లైన్ విచారణలు, నిరుపేదలు, వికలాంగులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేసినందుకు CJI కి బార్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది.
Also Read : లైగింక ఆరోపణ కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు.. హై కోర్టు తీర్పు రద్దు.. ఏం జరిగిందంటే.?
కాగా.. జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9, 2022న భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2016 మే 13న అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.