Big Stories

EC Seizes Record Rs 4650 CR Ahead of LS polls: రికార్డులు బ్రేక్.. 45 రోజుల్లో రూ.4650 కోట్లు సీజ్

- Advertisement -

ఒక్కసారి 2019 లెక్కలు చూద్దాం. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో 3 వేల 475 కోట్లను సీజ్ చేసింది సీఈసీ.. కానీ ఈసారి ఇంకా ఫస్ట్‌ ఎలక్షన్ నోటిఫికేషన్‌ కూడా రిలీజ్ కాలేదు. అప్పుడే ఈ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఇంకా కౌంట్ పెరుగుతూనే ఉంది. 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో డబ్బు దొరకడం ఇదే ఫస్ట్ టైమ్.. ఇందులో డబ్బు రూపంలో పట్టుకుంది. 395 కోట్లు.. లిక్కర్ రూపంలో పట్టుకుంది.. 489 కోట్లు.. డ్రగ్స్ 2 వేల 68 కోట్లు.. బంగారు, వెండి ఆభరణాలు 562 కోట్లు.. ఓటర్లను వలలో వేసుకునేందుకు పంచే సామాగ్రి 1142 కోట్లు.. మనం సింపుల్‌గా కోట్లు అనేస్తున్నాం కానీ.. అవి చూపించే ఇంపాక్ట్‌ అంతా ఇంతా కాదు.

- Advertisement -

ఈసారి పట్టుబడిన దాంట్లో ఓ విషయం ఆశ్చర్యంగా.. ఎక్కువ ఆందోళనకరంగా కనిపించేది నార్కోటిక్స్.. ఎన్నికల సమయంలో పట్టుకున్న వాటిలో డ్రగ్స్‌ వాల్యూనే 45 శాతం. ఇప్పటికే 2 వేల కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది సీఈసీ.. ఇది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పట్టుకున్న డ్రగ్స్‌ వాల్యూత 1279 కోట్లుగా ఉంది. సో.. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశంలో రోజురోజుకు డ్రగ్స్ వాడకం పెరుగుతుందని ఈ లెక్కలే చెబుతున్నాయి. స్వాధీనం చేసుకున్న క్వాంటిటీనే ఇంత ఉంటే.. అధికారుల కళ్లుగప్పి డెస్టినేషన్‌కు చేరుకున్న డ్రగ్స్ పరిస్థితేంటి? అన్నది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

Also Read: ఈడీ అరెస్ట్ చేసింది.. కేవలం 3 శాతం మంది రాజకీయ నాయకులనే: మోదీ

ఇవే కాకుండా టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ట్, గిఫ్ట్‌లు ఇలా అన్ని కలిపి మరో 1142 కోట్లు.. ఇవన్నీ ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతుండగా పట్టుబడ్డవే.. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో.. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు, IT, RBI, RPF, స్టేట్ ఎక్సైజ్, GFS, కస్టమ్స్, నార్కోటిక్స్, BSF.. ఇలా అన్ని వ్యవస్థలను రంగంలోకి దించింది ఈసీ.. ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దించి తనిఖీలను ముమ్మరం చేసింది. దీంతో ఏరులై పారుతున్న నగదుకు అడ్డుకట్ట పడింది..

ఎలక్షన్ కోడ్ వచ్చాకే కాదు.. కోడ్‌కు ముందు కూడా అనేక తనిఖీలను నిర్వహించింది. అంటే జనవరి, ఫిబ్రవరి లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడింది అక్షరాల 7 వేల 502 కోట్లు.. దీన్ని కూడా క్యాష్, లిక్కర్, డ్రగ్స్‌, గిఫ్ట్స్ రూపంలో పట్టుకుంది. అవి ఇవీ కలుపుకుంటే ఇలా స్వాధీనం చేసుకున్న నగదు విలువ 12 వేల కోట్లు. అంటే జనవరి ఒకటి నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు సీజ్‌ చేసిన వాటి వాల్యూ 12 వేల కోట్ల రూపాయలు.. సో 12 వేల కోట్లలో కూడా డ్రగ్స్ పర్సెంటేజ్ 75.. చాపకింద నీరులా డ్రగ్స్‌ దేశంలో ఎలా విస్తరిస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక స్టేట్ వైజ్‌గా చూస్తే.. ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది రాజస్థాన్.. రాజస్థాన్‌లో 778 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో గుజరాత్ 605 కోట్లు.. తమిళనాడు 460 కోట్లు.. మహారాష్ట్ర 431 కోట్లు.. పంజాబ్ 311 కోట్లు ఉన్నాయి. ఇక మన తెలుగు స్టేట్స్‌ విషయానికి వస్తే.. ఏపీలో 125 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 32 కోట్ల నగదు.. 19 కోట్ల విలువైన మద్యం, 4 కోట్ల విలువైన డ్రగ్స్.. బంగారు, వెండి ఆభరణాలు 57 కోట్లు.. గిఫ్ట్స్‌ ఐటమ్స్ 12 కోట్లు ఉన్నాయి. ఇక తెలంగాణ డిటెయిల్స్ చూస్తే.. ఈ రాష్ట్రంలో 121 కోట్లను సీజ్ చేశారు. ఇందులో 49 కోట్ల నగదు.. 19 కోట్ల లిక్కర్.. 22 కోట్ల విలువైన డ్రగ్స్.. 12 కోట్ల బంగారు ఆభరణాలు, 18 కోట్ల విలువైన గిఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి.

ఇవీ లెక్కలు.. ఈ లెక్క ఇంకా పెరగడం పక్కా.. ఎలక్షన్ తంతు ముగిసేందుకు అటు ఇటుగా ఇంకా రెండు నెలల టైమ్ ఉంది. సో స్వాతంత్ర్య భారదదేశ హిస్టరీలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాజకీయ నేతలు లిఖించబోతున్నారు. ఇది మాత్రం పక్కా.. ఫైనల్‌గా ఈ లెక్కలు చూస్తుంటే ఎన్నికలంటే ఓట్లు.. కోట్లు అన్నట్లుగా పరిస్థితులు.. ఓటర్ నోటు ఇస్తేనే ఓటు వేసే మెషిన్‌గా మారాడా? అన్న డౌట్ వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News