Shubhanshu Shukla: ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో 18 రోజులు గడిపి చరిత్ర సృష్టించిన.. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నడక నేర్చుకుంటున్నారు. అవును ఆయన ఇప్పుడు మళ్లీ నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. 18 రోజుల పాటు జీరో గ్రావిటీలో ఉండటంతో.. ఆయన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా నడవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లో ఉన్నారు. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. భూ వాతావరణానికి అలవాటు పడే విధంగా చర్యలు తీసుంటున్నారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న శుభాంశు ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి మెసేజ్‌లు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భూ వాతావరణ పరిస్థితులకు తన శరీరం వేగంగా స్పందిస్తున్న తీరు.. ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
జీరో గ్రావిటీలో గడిపిన అనుభవం:
జూన్ 25న ప్రారంభమైన యాక్సియం-4 మిషన్ లో భాగంగా, శుభాన్షుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ISS కు వెళ్లారు. ఈ మిషన్‌లో ఆయన 60 రకాల శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. అంతరిక్ష కేంద్రంలో త్రివర్ణ పతకాన్ని ఎగరేసి భారత గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతేకాకుండా అంతరిక్షంలో హెయిర్ కట్ చేయించుకున్న తొలి భారతీయుడిగా.. మరో అరుదైన ఘనతను కూడా సాధించారు.
భూమిపైకి సేఫ్ రిటర్న్:
మిషన్ ముగిసిన తర్వాత, శుభాన్షు శుక్లా, వారి బృందం క్యాలిఫోర్నియా పసిఫిక్ తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ క్యాప్స్యూల్ నుండి బయటకు వచ్చి, నవ్వుతూ అభివాదం చేశారు. అక్కడి నుంచే భూ వాతావరణానికి మళ్లీ అలవాటు పడే ప్రాసెస్ ప్రారంభమైంది. శరీరం మళ్లీ గమనాన్ని తేలికగా అంగీకరించదు, ముఖ్యంగా గుండె పనితీరు, నరాలు, కండరాలు, బోన్ డెన్సిటీ పునఃసాధనకు సమయం పడుతుంది.
నడక ప్రాక్టీస్ – ఒక కొత్త మిషన్:
అంతరిక్ష మిషన్ ముగిసిన తర్వాత.. ఆయన వైద్యుల పర్యవేక్షణలో నడక సాధన చేస్తున్నారు. నడకలో తేలికగా కనిపించే ప్రతి అడుగు వెనుక శ్రమ, పట్టుదల, శరీరానికి తిరిగి శక్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్వారంటైన్‌లో ఉన్న శుభాన్షు తన ఆరోగ్య పరిస్థితిని సంబంధించిన.. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన శరీరం భూ వాతావరణానికి వేగంగా స్పందిస్తున్న తీరు.. తనకే ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.
ఇండియా కోసం ప్రౌడ్ మూమెంట్:
ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రతిష్టను పెంచిన శుక్లా, ISSకు వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. రీసెర్చ్ తో పాటు భారత జెండాను అంతరిక్షంలో ఎగరవేసి.. 140 కోట్ల ప్రజలకు గర్వకారణంగా మారారు.
Also Read: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. ఒక్కసారిగా ప్రయాణికులంతా..?
ఈ యాత్ర ఒక్క శుభాన్షుకే కాదు, భారత అంతరిక్ష పరిశోధన రంగానికి ఒక మైలురాయి. భవిష్యత్తులో మరిన్ని భారత వ్యోమగాములు.. అంతరిక్షం వైపు ప్రయాణం చేసే దిశగా.. ఇది మార్గనిర్దేశకంగా నిలిచే అవకాశం ఉంది.
మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా
రోదసిలో 18 రోజులు గడిపి వివిధ ప్రయోగాలు చేసి, తిరిగి క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుక్లా
ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్లో నిపుణుల సమక్షంలో ఉన్న శుక్లా
భూ వాతావరణానికి తన శరీరం అలవాటు పడేందుకు నడకతో పాటు పలు వ్యాయామాలు చేస్తున్న శుక్లా… https://t.co/IWJ4yxOsTm pic.twitter.com/hkwkx8nfWa
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025