E-Paper
Advertisement

నాడు ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు బెంగాల్ ఘటన, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ ఆత్మహత్య!

నాడు ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు బెంగాల్ ఘటన, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ ఆత్మహత్య!
Advertisement

Kolkata: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. కీలక నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు ఈ మాట చెబుతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ, పార్టీ ఆఫీసులో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?

 

బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ ఆత్మహత్య!

Advertisement

దేశంలో ప్రతీకార రాజకీయాలు వేగంగా నడుస్తున్నాయి. అన్నిరాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు నెలకున్నాయి. ఒకప్పుడు దక్షిణాదికి పరిమితమైన ఈ తరహా రాజకీయాలు, మిగతా రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీఎంసీ సీనియర్ నేత, బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లో తన నివాసానికి సమీపంలోవున్న పార్టీ ఆఫీసులో ఫ్యాన్‌కు వేలాడుతూ మృతదేహం కనిపించింది. తాజా ఘటనతో టీఎంసీ పార్టీ నేతలు షాకయ్యారు. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం నిమిత్తం మెడికల్ కాలేజీకి తరలించారు.

 

బెంగాల్‌లో కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాలు?

Advertisement

ఆశిష్ బెనర్జీది ఆత్మహత్యా? దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి అందులో విషయాలు పోలీసులు పరిశీలిస్తున్నారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, రాజకీయాల్లోకి ప్రవేశించినందుకు బెనర్జీ విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉందని సమాచారం. ఎన్నికలలో టీఎంసీ ఓటమితో పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఒక పెద్ద రాజకీయ ఘటన ఇది. మాజీ టీఎంసీ శాసనసభ్యులు, నాయకులు అవినీతి సంబంధిత విచారణలు, అరెస్టులను ఎదుర్కొంటున్నారు.

 

టీఎంసీకి కీలకమైన నేతల్లో ఆశిష్ బెనర్జీ కూడా

బెంగాల్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం నేతల్లో ఆయన కూడా ఒకరు. రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మమతా ప్రభుత్వంలో ఆయన విద్య-వ్యవసాయ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయన పని చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశిష్.. బీజేపీ అభ్యర్థి ధృవ సాహా చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు నెలల కిందట బీర్భూమ్ జిల్లా టీఎంసీ కోర్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆశిష్ రాజీనామా చేశారు. దీనికితోడు వయస్సు మీద పడడం, అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీఎంసీకి కంచుకోటగా ఉన్న బీర్భూమ్ జిల్లా, ఇటీవలి ఎన్నికల్లో 11 సీట్లకు 6 స్థానాలను బీజేపీ గెలుచుకున్న విషయం తెల్సిందే.

ALSO READ: ఇండియన్ ఆయిల్ కంపెనీలో జాబ్స్.. రూ.1.60 లక్షల వరకు జీతం.. ఫ్రెషర్లకు మంచి అవకాశం

దక్షిణాదిలో ఏ రాష్ట్రం చూసినా ప్రతీకారం రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడుకి మాత్రమే పరిమితం. ఆ తర్వాత ఏపీకి విస్తరించింది. ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ వంతైంది. ఈ లెక్కన ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాల్లో నేతల ఆత్మహత్యల ఘటనలు నేతలను బెంబేలెత్తిస్తున్నాయి.

 

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×