E-Paper
Advertisement

ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు!

ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు!
Advertisement

Delhi Train Update: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఢిల్లీతో పాటు బీహార్ వైపు రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. పలు మార్గాల్లో రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రైళ్లపై ఈ ప్రభావం పడుతోంది. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు అధికారులు సూచిస్తున్నారు.

రైళ్ల రద్దు ఎందుకు? 

రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ, సిగ్నలింగ్ పనులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా ఢిల్లీ–రాజస్థాన్, ఢిల్లీ–బీహార్ మార్గాల్లో ప్రయాణించే వారు అలర్ట్ గా ఉండాలని సూచించింది.

అక్టోబర్ 5, 6 తేదీల్లో పలు రైళ్లు రద్దు

Advertisement

అక్టోబర్ 5న ఢిల్లీ నుంచి జైసల్మేర్ వెళ్లే 14087 ఢిల్లీ–జైసల్మేర్ రునీచా ఎక్స్‌ ప్రెస్ రద్దు చేశారు. అదే రైలు తిరుగు ప్రయాణంలో 14088 జైసల్మేర్–ఢిల్లీ రునీచా ఎక్స్‌ ప్రెస్ అక్టోబర్ 6న రద్దు కానుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ రైళ్లను ముందుగా చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

అక్టోబర్ 7న కూడా ప్రభావం

అక్టోబర్ 7న ఢిల్లీ కంటోన్మెంట్–జోధ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ సర్వీసులు కూడా క్యాన్సి కానుంది. 26481 జోధ్‌పూర్–ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్, 26482 ఢిల్లీ కంటోన్మెంట్–జోధ్‌పూర్ వందే భారత్ సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. దీంతో పండుగ సీజన్‌ లో రాజస్థాన్ వైపు వెళ్లే వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది.

ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి!

Advertisement

టికెట్ బుక్ చేసుకున్నంత మాత్రాన రైలు తప్పకుండా నడుస్తుందని అనుకోకూడదు. క్యాన్సిల్, రీషెడ్యూల్, దారి మళ్లింపులు ఎప్పటికప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుంది. అందుకే, బయలుదేరే ముందు NTES ద్వారా రైలు లైవ్ స్టేటస్ చూసుకోవాలి. అలాగే IRCTCలో మీ టికెట్ వివరాలు కూడా ఒకసారి పరిశీలించడం మంచిది. అవసరమైతే రైల్వే హెల్ప్‌ లైన్ 139కు కాల్ చేసి తాజా సమాచారం తెలుసుకోవచ్చు.

 ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పండుగ సీజన్‌లో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం, ప్రయాణానికి ఒక రోజు ముందు రైలు స్టేటస్ ను చూసుకోవడం, ప్రత్యామ్నాయ రైళ్ల వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇలా చేస్తే చివరి నిమిషంలో ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని ఈజీగా కొనసాగించే అవకాశం ఉంటుంది.

Read Also: హైదరాబాద్ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో ఆ రైళ్లకు హాల్టింగ్!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×