E-Paper
Advertisement

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!
Advertisement

Waqar Younis Blames Jasprit Bumrah:  టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మధ్యకాలంలో వరుసగా గాయాల బారిన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడడం లేదు. తరచూ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో ప్రత్యామ్నాయ బౌలర్ ను కూడా తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో మాత్రమే జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండి… ఆ తర్వాత గాయం పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడకుండా ముంబై ఇండియన్స్ తరఫున ఆడేందుకు మాత్రమే బుమ్రా ఆసక్తి చూపిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు.

1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి బుమ్రా చేరుకోడు!

యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను ( Jasprit Bumrah) ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు వకార్‌ యూనిస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయాల పేరుతో డ్రామాలు ఆడే జస్‌ప్రీత్ బుమ్రాను వసీం అక్రమ్ తో పోల్చడం దారుణమని మండిపడ్డారు. మరో వెయ్యి జన్మలు ఎత్తినా వసీం అక్రమ్ స్థాయికి ( Wasim Akram) జస్‌ప్రీత్ బుమ్రా చేరబోడని బాంబు పేల్చారు. పాకిస్తాన్ మాజీ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వకార్ యూనిస్ (Waqar Younis).

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

ప్రపంచంలోనే అత్యధిక బౌలర్ వసీం అక్రమ్ ఒక్కడేనని వెల్లడించారు. అతడిని మించిన బౌలర్ ఇప్పటి వరకు ప్రపంచంలో లేడని పేర్కొన్నారు. యార్కర్లు వెయ్యాలన్న, బౌన్సర్లు అందించాలన్న వసీం అక్రమ్ ఒక్కడే అద్భుతంగా వేయగలుగుతాడని వివరించారు. పాకిస్తాన్‌ జట్టుకు అతడు అందించిన సేవలు అంతా ఇంతా కాదని ప్రశంసించారు. అందుకే ఇప్పటికీ కూడా వసీం అక్రమ్ పేరు మారుమోగుతోందని వెల్లడించారు.

వసీం అక్రమ్ తో బుమ్రాను పోల్చద్దు – వకార్ యూనిస్

Advertisement

ప్రపంచ దిగ్గజ బౌలర్లలో ఒక్కడైనా వసీం అక్రమ్ తో యార్కర్ల కింగ్ బుమ్రాను అస్సలు పోల్చవద్దని వకార్ యూనిస్ వెల్లడించారు. వసీం అక్రమ్ స్థాయికి బుమ్రా ఇంకా చేరుకోలేదన్నారు. బుమ్రా కేవలం ఐపిఎల్ కోసం మాత్రమే ఆడతాడని బాంబు పేల్చారు. జాతీయ జట్టుకు ఆడమంటే గాయాల సాకు చూపిస్తాడని హేళన చేశారు. జాతీయ జట్టుకు వెన్నుపోటు పొడిచి కేవలం ముంబై ఇండియన్స్ కు మాత్రమే ఆడుతున్నాడని మండిపడ్డారు. పాకిస్తాన్ లో ఇలాంటి బౌలర్లు ఎవరూ లేరని హేళన చేశారు.

వసీం అక్రమ్ కంటే అద్భుతంగా యార్కర్లు బుమ్రా వేస్తారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అది అసలు వాస్తవం కాదని తెలిపారు. బుమ్రా కంటే భయంకరమైన యార్కర్లు వేశాడని వసీం అక్రమ్ ను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి అని పేర్కొన్నారు. కానీ బుమ్రా మాత్రం జాతీయ జట్టుకు కాకుండా మూడు నెలల పాటు ముంబై ఇండియన్స్ కు నిద్ర లేకుండా డ్యూటీ చేస్తాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలాంటోన్ని వ‌సీం అక్రమ్ తో పోల్చడం ఎంత వరకు సమంజసం అంటూ నిలదీశారు వకార్ యూనిస్.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

 

Related News

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌర‌వించండి.. బీసీసీఐపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు!

ఇప్పుడే సంబ‌రాలే చేసుకోవ‌ద్దు..బంగ్లాదేశ్ కు ర‌మీజ్ రాజా హెచ్చ‌రిక‌

డేవిడ్ వార్న‌ర్ పోస్ట్ వైర‌ల్…జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ట్రోల్స్‌ !

స్టీవ్ స్మిత్ మాస్ట‌ర్ మైండ్… అంపైర్ ఔట్ ఇవ్వ‌క ముందే DRS !

జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం…మా లంక ప్లేయ‌ర్ల‌కు మాన‌వ‌త్వం లేదంటూ సంగ‌క్క‌ర్ ఫైర్‌!

Big Stories

Advertisement
×