Gundeninda GudiGantalu Today episode November 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి దినేష్ తో మాట్లాడటం చూస్తుంది ప్రభావతి.. రోహిణి ఎవరితో మాట్లాడుతుంది అని ప్రభావతికి డౌట్ వస్తుంది. రోహిణి జాతకం బయట పడిందని అనుకుంటుంది. అతన్ని ఇక్కడనుంచి వెళ్ళిపో మా అత్తగారు చూశారు అని చెప్తుంది . రోహిణి వెంటనే ప్రభావతి దగ్గరకు వస్తుంది. ఎవరమ్మా అతను అంటే ఎవరు అడ్రస్ కోసం అడుగుతున్నారు అత్తయ్య అని మ్యానేజ్ చేస్తుంది రోహిణి. ఇక మనోజ్ వెళ్తుండగా ప్రభావతి పిలుస్తుంది. నువ్వు లోపలికి వెళ్లి సంతకాలు ఏమైనా పెట్టాలా అని అంటుంది. ఏమైంది అమ్మా అనగానే నువ్వు ఏదొక జాబ్ తెచ్చుకో లేకుంటే ఇక అందరు మనల్ని గెంటేస్తారు అని అంటుంది. మనోజ్ రేంజ్ కు తగ్గట్లు ఉండాలి అని అంటాడు. దానికి ప్రభావతి నువ్వు రేంజ్ పక్కనపెట్టి ఏదొక జాబ్ తెచ్చుకో అని అంటుంది. ఇక రోహిణి తన మాట వినలేదని వాళ్ల అమ్మకు ఫోన్ చేసి రోహిణికి యాక్సిడెంట్ అయిందని దినేష్ చెప్తాడు. ఇక మనోజ్ మలేషియాకు వెళ్లి రండి అని ప్రభావతి ఐడియా ఇస్తుంది. రోహిణిని ఎలాగైనా ఒపించి మలేషియా కెళ్ళమని చెప్తుంది. రోహిణి వింటుంది. ఇక రోహిణి దగ్గరకు వచ్చేసి ప్రభావతి మనోజ్ అడుగుతారు. లేని నాన్నను ఎలాగైనా క్రియేట్ చెయ్యాలని అనుకుంటుంది. సేటు తిట్టాడని బాలు కోపంతో ఫుల్లుగా తాగి అత్తింటికి వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని దినేష్ చెప్పడంతో వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్లు చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి లిఫ్ట్ చేయదు. నా టెన్షన్స్ నాకుంటే మధ్యలో ఈవిడ ఒకటే ని రోహిణి వాళ్ళ అమ్మని బ్లాక్ చేస్తుంది.. అంటే నువ్వు నాకు దూరంగా ఉండాలి నేను నీకు ఫోన్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడే మనోజ్ ప్రభావతి రోహిణి దగ్గరకు వస్తారు. రోహిణిని మీ నాన్నతో పండగ పూట కూడా మాట్లాడుకున్నా ఉంటే ఏం బాగుంటుంది అమ్మ ఒకసారి ఫోన్ చెయ్ వాడు నేను మాట్లాడతాను మీరు ఒకసారి వెళ్లి వస్తే అందరికీ బాగుంటుంది కదా అనేసి రోహిణి అడుగుతుంది ప్రభావతి.. దానికి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. రేపటిలోగా ఏదో ఒకటి చేసి కొత్తగా నాన్నని క్రియేట్ చేయాలి లేకుంటే కథ అడ్డం తిరిగేలా ఉందని ప్లాన్ చేస్తుంది. నేను చెప్పాను అత్తయ్య మీకు రేపట్లోగా చెప్తానని చెప్పాడు ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తాను అని అంటున్నాడని చెబుతుంది. రేపు ఏ విషయం అనేది చెప్తాను నాకు కూడా వెళ్లాలని ఉంటుంది కదా అత్తయ్య కాకపోతే కుదరలేదు కాబట్టి నేను ఆగాను లేకుంటే నేను వెళ్ళేదాన్ని కదా అని రోహిణి కొత్త ప్లాను వేస్తుంది. రోహిణి మాయమాటలను నమ్మి మరోసారి ప్రభావతి మోసపోతుంది.
ఇక బాలు సేటు తిట్టాడని కారు పోయిందని బాధతో బాలు మళ్లీ తాగేసి అత్తగారింటికి వెళ్తాడు. అక్కడ మీనా అని పిలుస్తాడు మీనా లేకపోవడంతో పార్వతి వచ్చి ఏం బాబు టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతుంది. మీ కూతురు ఎక్కడ అనేసి అడుగుతాడు. మీ ఇంటికి వెళ్ళింది అని శివ చెబుతాడు.. పండక్కి పిలిచారు కదా మేము ఇక్కడికి వచ్చాం కదా మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఏం మోసుకుని వెళ్ళింది? అని బాలు పార్వతి అంటాడు. మీనాకు కొంచెం కూడా బుద్ధి లేదు ఇప్పుడు నన్ను అక్కడ ఇరికించడానికి వెళ్లింది. దీనివల్ల నాకు అన్ని తలనొప్పులు అనేసి అనుకుంటూ ఇంటికి వెళ్తాడు.
ఇక కారు పోయిన విషయాన్ని రాజేష్ కి చెప్తాడు. ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాడు బాలు. మీ నాన్న పిలిచి అడుగుతాడు. ఏమైంది ఎందుకు వచ్చావు అని బాలు మీనాను అడుగుతాడు. నన్ను బలవంతంగా తీసుకొని మీ పుట్టింటికి వెళ్లావు. పండక్కేదో ఉంటుంది కదా అని నేను అనుకున్నాను. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడంలో అర్థం ఏంటి అని మీ నాన్నను బాలు అడుగుతాడు. మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నారు కానీ మనం లేమని నేను నిజం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే అక్కడ ఉండడం నాకు ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసాను అని అంటాడు. రవి గురించి టాపిక్ మాట్లాడుతాడు. బాలు బామ్మ చూస్తుంది. ఏమైందని అడుగుతుంది. ఇక సత్యం వాళ్ళ అమ్మకు ఏమి చెబుతాడో చూడాలి.. సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.