PM Modi: మణిపూర్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. చురాచంద్ పూర్ లో బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హింసాత్మక ఘటనలతో నిరాశ్రయులైన వారితో ప్రధాని మోదీ మాట్లాడారు. మణిపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని భరోసా ఇచ్చారు. జీఎస్టీనీ భారీగా తగ్గించామని… జీఎస్టీ తగ్గింపుతో మణిపూర్ వాసులకు ఎంతో లాభం చేకూరిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
మణిపూర్ ను శాంతికి చిహ్నంగా మార్చాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అల్లర్లతో, కొన్ని రోజుల పాటు దారుణ ఘటనలు చోటుచేసుకున్న రెండేళ్ల తర్వాత మణిపూర్ లో ప్రధాని పర్యటిస్తు్న్నారు. దీంతో స్థానికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మణపూర్ లో జరిగన అల్లర్లు కారణంగా సర్వం కోల్పోయాని ప్రధానికి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గొడవలతో పాఠశాలలు బంద్ కావడంతో చదువుకు దూరం అయ్యామని పిల్లలు కంటతడి పెట్టారు. చిన్న పిల్లల బాధను చూసిన ప్రధాని ఒక్కసారిగా చలించిపోయారు. నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను కలిసి ప్రధాని మోదీ భరోసా నిచ్చారు. మణిపూర్ రాష్ట్రానికి ఆయన రూ.8500 కోట్ల విలువైన ప్రాజెక్టులను గిఫ్ట్ గా ఇచ్చారు.
ALSO READ: Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట
మణిపూర్ లో హింస జరగడం దురదృష్టకరమని అన్నారు. కేంద్రం మీతో ఎల్లవేళలా తోడుగా ఉంటుందని.. రాష్ట్ర ప్రజలకు ఏది కావాలన్న తాను ఉన్నానని ప్రధాని హామీ ఇచ్చారు. ఇక నుంచి మణిపూర్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ప్రధాని నిత్యం అందుబాటులో ఉంటాడని భరోసాని కల్పించారు. రాష్ట్రం శాంతితోనే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలో రూ.7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల జీవితాలను, కొండలపై నివసిస్తున్న గిరిజన ప్రజల జీవన శైలిని మరింత మెరుగుపరుస్తాయని వివరించారు.
ఇంతకు ముందు రాష్ట్రంలో ఇక్కడ గ్రామాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉండేదని.. ఇఫ్పుడు వందలాది గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. కొండ ప్రాంతాల ప్రజలు, గిరిజన గ్రామాలు దీని వల్ల చాలా ప్రయోజనం పొందాయని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే మణిపూర్‌లో రైలు కనెక్టివిటీ విస్తరిస్తోందని పేర్కొన్నారు. జిరిబామ్-ఇంఫాల్ రైల్వే లైన్ త్వరలో రాజధాని ఇంఫాల్‌ను జాతీయ రైలు నెట్‌వర్క్‌కు కలుపుతుందని ప్రధాని చెప్పారు. పిఎం-దేవైన్ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం ఐదు కొండ జిల్లాల్లో ఆధునిక ఆరోగ్య సేవలను అభివృద్ధి చేస్తోందని అన్నారు.