E-Paper
Advertisement

సర్వీస్ సెంటర్‌కు షాక్.. ఇంట్లోనే EV బ్యాటరీని రిపేర్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!

సర్వీస్ సెంటర్‌కు షాక్..  ఇంట్లోనే EV బ్యాటరీని రిపేర్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!
Advertisement

EV Battery Repair Goes Viral: ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ ఖర్చులు ఒక్కోసారి యజమానులకు షాకిస్తుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ సంబంధిత సమస్యలు వస్తే రిపేర్ లేదంటే రీప్లేస్ మెంట్ ఖర్చు పెద్ద మొత్తంలో ఉంటుంది.  ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి అచ్చం ఇలాంటి ఎక్స్ పీరియెన్స్ అయ్యింది. సర్వీస్ సెంటర్ కు బిల్లు చెల్లించే బదులుగా.. ఇంట్లోనే తన ఎలక్ట్రిక్ SUV బ్యాటరీని స్వయంగా రిపేర్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో సదరు విద్యార్థి తన కారులోని కొంత భాగాన్ని విప్పి, బ్యాటరీ ప్యాక్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాటరీలో అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తించి, తక్కువ ఖర్చుతో దాన్ని సరిచేసినట్లు తన పోస్టులో వెల్లడించాడు.

రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం

తన ఎలక్ట్రిక్ కారులో సమస్య వచ్చిన తర్వాత యజమాని అధీకృత సర్వీస్ సెంటర్‌ కు వెళ్లాడు. అయితే, అక్కడ రిపేర్ కోసం చాలా  ఖర్చు అవుతుందని చెప్పారు. అంతేకాదు, అవసరమైన రీప్లేస్‌మెంట్ పార్ట్‌ లు రావడానికి కూడా కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థి సమస్యను తానే సాల్వ్ చేసుకోవాలని భావించాడు. కారులోని సంబంధిత భాగాలను విడదీసి బ్యాటరీ ప్యాక్‌ ను ఓపెన్ చేసి పరిశీలించాడు. లోపాన్ని గుర్తించిన తర్వాత అవసరమైన మరమ్మతు చేశాడు. సర్వీస్ సెంటర్ చెప్పిన డబ్బుతో పోల్చితే తక్కువ మొత్తంలో సమస్యను పరిష్కారం చేశాడు. ఈ రిపేర్ కోసం కేవలం రెండు రోజుల సమయం పట్టినట్లు సదరు విద్యార్థి వెల్లడించాడు.

నెటిజన్ల ప్రశంసలు

Advertisement

ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతో వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యను స్వయంగా పరిష్కరించుకోవడాన్ని అభినందిస్తున్నారు. “ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు” అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం EV సర్వీసింగ్ ఖర్చులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీలు రిపేర్లకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ విమర్శలు చేశారు.

ప్రమాదకరం అంటున్న మరికొంత మంది!

మరోవైపు ఈ వీడియోను చూసి ఎవరూ తమ EV బ్యాటరీని తామే రిపేర్ చేయడానికి ప్రయత్నించకూడదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే EVలలో ఉండే ట్రాక్షన్ బ్యాటరీలు సాధారణ కార్ బ్యాటరీల మాదిరిగా ఉండవు. అవి వందల వోల్టుల స్థాయిలో పనిచేసే హైవోల్టేజ్ వ్యవస్థలు. బ్యాటరీ ప్యాక్‌ను సరైన జాగ్రత్తలు లేకుండా తెరిస్తే విద్యుత్ షాక్, షార్ట్ సర్క్యూట్, ఆర్క్ ఫ్లాష్, అగ్నిప్రమాదం వంటి తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. బ్యాటరీలోని సెల్స్ దెబ్బతింటే థర్మల్ రన్‌ అవే లాంటి ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అంటున్నారు. హై వోల్టేజ్ EV బ్యాటరీలను రిపేర్ చేయడానికి ప్రత్యేక శిక్షణ, సరైన ఇన్సులేటెడ్ టూల్స్, ఐసోలేషన్ విధానాలు, ప్రొటెక్షన్ పరికరాలు అవసరం. అందుకే అనుభవం లేని వ్యక్తులు కేవలం డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో బ్యాటరీ ప్యాక్‌ను తెరవడం ప్రమాదకరం అంటున్నారు.

Advertisement

Read Also: చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

Tags

Related News

కియా సూపర్ సర్‌ ప్రైజ్.. ఏకంగా 8 ఎలక్ట్రిఫైడ్ మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?

చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?

Big Stories

Advertisement
×