BigTV English

No Petrol: పాత వాహనాలకు జులై 1 నుంచి నో పెట్రోల్‌, నో డీజిల్‌..

No Petrol: పాత వాహనాలకు జులై 1 నుంచి నో పెట్రోల్‌, నో డీజిల్‌..

పాత వాహనాలు ఉన్న యజమానులకు ఇదో బ్యాడ్ న్యూస్. ఇది వరకే ఈ బ్యాడ్ న్యూస్ ని కేంద్రం ప్రకటించినా, మధ్యలో మనసు మార్చుకుంటుందేమో అని అనుకున్నారంతా. కానీ అలాంటిదేమీ లేదు. జులై-1 నుంచి పాతవాహనాలున్న యజమానులకు కష్టాలు మొదలైనట్టే. ఎందుకంటే వాటికి పెట్రోల్, డీజిల్ పోయొద్దని బంకుల యజమానులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జులై-1 నుంచి అవి కచ్చితంగా అమలు కావాల్సిందేనని తేల్చి చెప్పింది కేంద్రం. దీంతో హడావిడి మొదలైంది.


పాత వాహనం అంటే ఏంటి..?
కొత్త వాహనం అంటే సీల్డ్ బండి, మరి పాత వాహనం అంటే..? ఎన్నాళ్ల పాతవాహనం, ఎన్ని కిలోమీటర్లు తిరిగిన వాహనం. ఇక్కడ పాత వాహనానికి రెండు అర్థాలు చెప్పింది కేంద్రం. డీజిల్ వాహనం అయితే కొని పదేళ్లు దాటి ఉండాలి, పెట్రోల్ వాహనం అయితే పదిహేనేళ్లు అయి ఉండాలి. అలాంటి వాహనాలను పాత వాహనం అంటారని నిర్వచనం ఇచ్చింది. అలాంటి వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి కార్ల విషయంలోనే ఈ నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నారు.

ఢిల్లీలో మాత్రమే..
పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయొద్దనే నిబంధనలు ఢిల్లీలో మాత్రమే అమలులోకి వస్తాయి. జులై-1నుంచి ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఢిల్లీలో తీవ్రంగా ఉన్న వాయు కాలుష్యం సమస్యకు చెక్‌ పెట్టేందుకే ఈ నిబంధనలు తెరపైకి తెస్తున్నారు.


ఎలా గుర్తిస్తారు..?
ఇలాంటి నిబంధన ఒకటి ఉంది అని తెలిస్తే పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు కూడా అలర్ట్ గా ఉంటారు. తమ వాహనం జస్ట్ ఏడేళ్ల క్రితం కొన్నది, లేకపోతే ఎనిమిదేళ్ల క్రితం కొన్నది అని చెబుతారు. అయితే ఆ వాహనం అసలు వయసు ఎంత అని నిర్థారించేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పాత వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ సిస్టమ్ ని పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్న 520 బంకుల్లో వీటిని ముందుగానే ఏర్పాటు చేసి, ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు.. ఈ కెమెరాలు 3.63 కోట్ల వాహనాలను స్క్రీనింగ్ చేశాయి. వాటిలో 4.90 లక్షల వాహనాలకు లైఫ్ టైమ్ పూర్తయినట్టు తేలింది. ఈ కెమెరాలను వాహనాల డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. దీంతో ఇవి పాత వాహనాలను గుర్తిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలను కూడా పసిగడతాయి. వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఆ వివరాలను మరోసారి క్రాస్ చెక్ చేసుకుని సిబ్బంది.. ఆయా వాహనాలకు పెట్రోల్, డీజిల్ పట్టాలో లేదో నిర్ణయించుకుంటారు.

ఢిల్లీలో ఇలాంటి పాతవాహనాలు దాదాపు 62 లక్షలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. జులై-1 నుంచి ఢిల్లీలో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. అక్టోబర్‌ 31 నుంచి గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌ బుద్ధనగర్, సోనిపట్‌ ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలు చేస్తారు. 2026 ఏప్రిల్‌ 1 నుంచి నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌) పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేస్తారు. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా, కఠినంగా అమలు చేయడం కోసం, ఢిల్లీ రవాణా శాఖ 100 టీమ్‌లను రంగంలోకి దించింది.

Related News

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Big Stories

×