Shark Tank India 5 Promo: ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోనీ లివ్ లో ప్రసారమయ్యే ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2021లో ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ సీజన్లకు అనుపమ్ మిట్టల్, అమన్ గుప్తా, వినీతా సింగ్, నమితా థాపర్, పెయూష్ బన్సాల్ సహా పలువురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ నాల్గవ సీజన్ లో కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ కూడా ఉన్నారు. త్వరలో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ సీజన్ 5 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా రాబోయే సీజన్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమో చూసి అందరూ షాకవుతున్నారు. దానికి కారణం ఏంటంటే..
భారతీయ సీఈవోలపై సటైర్లు వేసిన తాజా ప్రోమో
‘షార్క్ ట్యాంక్ ఇండియా’ సీజన్ 5 ప్రోమో భారతీయ సీఈవోలను విమర్శిస్తూ కొనసాగింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడిన 1 నిమిషం 40 సెకన్ల నిడివి గల వీడియో పవర్ ఫుల్ కామెంట్ తో ప్రారంభమవుతుంది. “భారతదేశంలో చాలా మంది సీఈవోలు తమ దేశంలోని 150 కోట్ల మంది పేదరికాన్ని పెంట్ హౌస్ నుంచి చూస్తున్నారు. ఎందుకంటే, ఈ పేద సీఈవోలు ఇప్పటికీ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనలేదు” అంటూ వ్యంగ్య రంగరించిన వాయిస్ తో మొదలవుతుంది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కామెంట్స్ ను కోట్ చేస్తుంది.”మీ బాస్‌ల కోసం వారానికి 70 గంటలు ఓవర్ టైమ్ పని చేయండి. AI ద్వారా భర్తి చేసి మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేసే వరకు కష్టపడండి” అని వినిపిస్తుంది. ఈ ప్రోమోలోని ప్రతి లైన్ లో అధిక పని సంస్కృతిని, కార్పొరేట్ ల అంధ విధేయతను ఎగతాళి చేస్తూ సాగుతుంది. “విశ్వసనీయంగా ఉండండి. మీ మిలియనీర్ బాస్ లను బిలియనీర్లుగా మారుస్తూ ఉండండి. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5 రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. కానీ, నమోదు చేసుకోకండి. మీ బిలియనీర్ బాస్‌ను కాపాడుకోండి. ‘షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 5’ కోసం దరఖాస్తు చేసుకోకండి. ఎందుకంటే ఇది మీ బాస్ వ్యాపారం గురించి కాదు, ఇది మీరు మీ జీవితాన్ని స్వంతంగా నిర్మించుకోవడం గురించి ఉంది కాబట్టి” అంటూ ప్రోమో ఎండ్ అవుతుంది.
అద్భుతం అంటున్ననెటిజన్లు
సీజన్ 5కి సంబంధించిన వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. చాలా మంది ఈ ప్రోమోను ప్రశంసిస్తున్నారు. “నేను ఇప్పటి వరకు భారతీయ షోలో చూసిన అత్యంత నిజాయితీగల ప్రోమో” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “బ్రో నా బాస్ నెక్ట్స్ ఆడిని కొనడానికి 80 గంటలు పని చేస్తున్నాడు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: అమ్మ నాతో చివరిగా చెప్పింది ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్వేచ్ఛ కూతురి మాటలు