BigTV English

New Criminal Laws Ready for Rollout: జులై 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టాలు.. జీరో FIR, ఆన్‌లైన్‌‌లోనే ఫిర్యాదులు!

New Criminal Laws Ready for Rollout: జులై 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టాలు.. జీరో FIR, ఆన్‌లైన్‌‌లోనే ఫిర్యాదులు!

New Criminal Laws Ready for Rollout on July 1: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలు అమలు కానున్నాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లోనే పోలీసు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి కీలక అంశాలు ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. కొత్తచట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు వీలు కలగనుంది. దీంతో తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీసుల స్పందనను సులభతరం చేస్తుంది.


  • ఏదైనా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో ఏ పోలీస్ స్టేషన్ కైనా తెలియజేసే అవకాశం ఉంటుంది.
  • జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉండనుంది.
  • బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. వాటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీట్, స్టేట్ మెంట్లతోపాటు ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.

Also Read: Railway New Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా ? అప్పర్, లోయర్ బెర్తుల వారికి గుడ్ న్యూస్

  • అరెస్ట్ సందర్భాల్లో బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు వీలు కలుగుతుంది.
  • అరెస్ట్ కు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తోపాటు జిల్లా హెడ్ క్వార్టర్లలోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్ట్ సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.
  • కేసు, దర్యాప్తును పటిష్ఠంగా నిర్వహించేందుకు గాను తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకు నేరం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించే క్రమాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించాలి.
  • పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ఆపద సమయంలో వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు త్వరగా కోలుకోవాలనేది ఉద్దేశం.

Also Read: NEET-UG Paper leak: నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభం.. బీహార్‌లో ఇద్దరిని..


  • ఆన్ లైన్ లోనే సమన్లు జారీ చేయడం.. తద్వారా పేపర్ వర్క్ ను తగ్గించి, అన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సమాచారం అందించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
  • మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి స్టేట్ మెంట్ ను మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు లేనిపక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి.
  • కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
  • సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల పరిరక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.
  • స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. తమ తప్పిదాలను తెలుసుకోవడంతోపాటు సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ చట్టాలను రూపొందించారు.

Also Read: Ratan Tata Request : నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”

  • అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాల్సి ఉంటుంది.
  • మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతోపాటు 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉండనున్నది. వారు నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందే అవకాశం ఈ చట్టాల్లో కల్పించారు.

న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు కేసులను వేగంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 పేరుతో మొత్తం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమలుకానున్నాయి.

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×