E-Paper
Advertisement

Diamond Jewellery Robbery: జస్ట్ 5 మినిట్స్.. అలా వచ్చారు.. ఇలా రూ.10 కోట్ల ఆభరణాలు తీసుకెళ్లారు..

Diamond Jewellery Robbery: జస్ట్ 5 మినిట్స్.. అలా వచ్చారు.. ఇలా రూ.10 కోట్ల ఆభరణాలు తీసుకెళ్లారు..
Advertisement

 Diamond Jewellery Robbery: కర్ణాటకలోని మైసూర్‌ జిల్లాలో పట్టపగలే జరిగిన ఒక భారీ దోపిడీ ఉదంతం కలకలం రేపింది. హున్సూర్ పట్టణంలోని ‘స్కై గోల్డ్ అండ్ డైమండ్స్’ షోరూంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు సినీ ఫక్కీలో విరుచుకుపడి..  సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం,  వజ్రాభరణాలను దోచుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీని ముగించి పరారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో..  ముఖాలకు మాస్కులు ధరించిన ఐదుగురు దుండగులు రెండు మోటార్ సైకిళ్లపై షోరూం వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించిన వెంటనే వారు తమ వద్ద ఉన్న తుపాకులతో సిబ్బందిని,  వినియోగదారులను బెదిరించారు. ప్రతిఘటిస్తే కాల్చివేస్తామని హెచ్చరిస్తూ అందరినీ ఒక మూలకు చేర్చారు.

Advertisement

ముందుగా పక్కా స్కెచ్‌తో వచ్చిన దుండగులు..  షోరూంలోని షోకేసుల్లో ఉన్న ఖరీదైన వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలను వేగంగా బ్యాగుల్లో సర్దుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం..  దుండగులు లోపలికి వచ్చిన సమయం నుంచి దోపిడీ ముగించుకుని బయటకు వెళ్లే వరకు పట్టిన సమయం కేవలం ఐదు నిమిషాలే. దోపిడీ అనంతరం వారు హున్సూర్-మడికేరి రహదారి వైపు వేగంగా పరారయ్యారు.

షోరూం యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో మైసూర్ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్,  డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. దుండగుల కదలికలు  వారు వాడిన వాహనాల వివరాల కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాలైన కొడగు, హాసన్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.

Advertisement

ఈ ఘటనతో మైసూర్ పరిసర ప్రాంతాల్లోని నగల వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద దోపిడీ జరగడం గమనార్హం.

AlSO READ: Hyderabad: భాగ్యనగరంలో జింక మాంసం కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్వోటీ బృందం

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×