E-Paper
Advertisement

ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా? తక్కువ ధరలో టాప్-5 పవర్ బ్యాంక్స్ ఇవే!

ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా? తక్కువ ధరలో టాప్-5 పవర్ బ్యాంక్స్ ఇవే!
Advertisement

Best Power Banks 2026: ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ తో పాటు ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్, టాబ్లెట్స్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాల్లో ఉన్నప్పుడు వాటిని ఛార్జ్ చేయడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో పవర్ బ్యాంక్స్ ఇందుకు ప్రత్యామ్నయంగా మారుతోంది. అయితే వాటి బ్యాటరీ కెపాసిటీ తో పాటు ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా? లేదా? అన్నది కూడా కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రూ.1,800 బడ్జెట్ లో లభిస్తున్న టాప్ – 6 పవర్ బ్యాంక్స్, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఈ కథనంలో చూద్దాం.

boAt Energyshroom PB401

రూ. 1,799 ధరకు లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్.. ఈ జాబితాలో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇది 20,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో పాటు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో ఒకేసారి ఛార్జ్ చేయడానికి వీలుగా నాలుగు అవుట్‌పుట్ పోర్టులు ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు, టాబ్లెట్‌లు, ఇయర్ బడ్స్ వంటి అన్ని రకాల USB-C పరికరాలకు ఇది చక్కగా సరిపోతుంది. ఎక్కువ డివైజ్‌లు ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

ZEBRONICS EnergiSafe 10R2

Advertisement

వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కావాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. రూ. 1,299 లభించే ఈ 10,000mAh పవర్ బ్యాంక్.. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 22.5W పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా ఐఫోన్, ఎయిర్‌పాడ్స్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. ఇందులో ఇన్ బిల్ట్ టైప్-సి, లైట్నింగ్ కేబుల్స్, ఐదు అవుట్‌పుట్ ఆప్షన్లు ఉన్నాయి.

Foxin ChargeX20 20000mAh

ప్రత్యేకంగా ఛార్జింగ్ వైర్లు తీసుకెళ్లాల్సిన పనిలేకుండా ఉండాలని భావించే వారికి ఈ పవర్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. రూ. 1,789 లభించే ఈ పవర్ బ్యాంక్.. 20,000mAh కెపాసిటీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో టైప్-సీ, 8-పిన్ బిల్ట్ ఇన్ కేబుల్స్ ఉన్నాయి. వీటి సాయంతో ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లకు విడిగా కేబుల్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేకుండానే ఛార్జ్ చేసుకోవచ్చు.

Beetel Volte Series PB20N Nano

Advertisement

ఈ పవర్ బ్యాంక్ రూ. 1,299 ధరలో 20,000mAh కెపాసిటీని అందిస్తోంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు QC3.0, PD3.0, PPS ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్టులతో పాటు పవర్ బ్యాంక్ ఛార్జ్ అవుతున్నప్పుడే వేరే డివైజ్‌ను ఛార్జ్ చేసుకునే ‘పాస్ త్రూ ఛార్జింగ్’ ఫీచర్ కూడా ఉంది. యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ ఫోన్లను ఇది చాలా వేగంగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Also Read: రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!

Lifelong Electronics 10000mAh

జేబులో పట్టేంత కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్.. 10000mAh బ్యాటరీని కలిగి ఉంది. రూ. 1,490 ధర కలిగిన ఈ మోడల్‌లో ఏకంగా 3 ఇన్‌పుట్, 6 అవుట్‌పుట్ ఆప్షన్లు ఉండటం విశేషం. ఇందులో బిల్ట్-ఇన్ USB-A, యూఎస్‌బీ-సీ, లైట్నింగ్ కేబుల్స్‌తో పాటు అదనంగా పోర్టులు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో ఛార్జింగ్ వైర్ల గందరగోళం లేకుండా తేలికగా తీసుకెళ్లడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Also Read: Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!

Tags

Related News

రియల్‌మీ నుంచి హ్యారీ పాటర్ లవర్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఈ క్రేజీ లుక్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!

ఐఫోన్ 18 ప్రో అంత చౌక? భారత్ నుంచి దుబాయ్‌కి యువత పరుగులు

విండోస్‌కు చెక్ పెట్టేలా గూగుల్ నుంచి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే కొనకుండా వదిలిపెట్టరు!

Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!

ఎప్పుడూ అదే గ్రీన్ స్క్రీన్‌తో బోర్ అనిపిస్తుందా? వాట్సప్‌లో రాబోతున్న ఈ కొత్త థీమ్స్ చూశారా?

ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!

Big Stories

Advertisement
×