E-Paper
Advertisement

జెన్ జీల కోసం ప్రధాని మోదీ భారీ ప్రకటన.. యువత కోసం ఉచిత కోచింగ్, ఏఐ ట్రైనింగ్

జెన్ జీల కోసం ప్రధాని మోదీ భారీ ప్రకటన.. యువత కోసం ఉచిత కోచింగ్, ఏఐ ట్రైనింగ్
Advertisement

Delhi: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఈసారి ప్రధాన తన స్పీచ్‌లో మిగతా వర్గాల కంటే జెన్ జీపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. యువతను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు. యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్, ఏఐ ట్రైనింగ్ అందించే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్‌లైన్ కోచింగ్‌ను పొందగలిగే ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుందని అన్నారు.

ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ స్పీచ్‌లో రెండు అంశాలు కీలక

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. యువత పాత్ర గురించి ప్రస్తావించడంతోపాటు సంస్కరణల వేగాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశ కలలను సాకారం చేసేందుకు యువత, తల్లులు, సోదరీమణులు, రైతులు, కార్మికులపై తనకు విశ్వాసం ఉందన్నారు. దేశ యువతపై నాకు నమ్మకం ఉందని, దేశం కలలను సాకారం చేయడంలో యువత సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అన్నారు. జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలకు ముఖ్యమైన కానుక ప్రకటించారు.

Advertisement

 

జెన్ జీ కోసం ప్రధాని మోదీ భారీ ప్రకటన

ఏడాదిలోగా కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామన్నారు. పేద-మధ్యతరగతి యువతీయువకులు వివిధ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం సాగించే ప్రయాణంలో యువత పోషించాల్సిన పాత్ర చాలా పెద్దదిగా చెప్పుకొచ్చారు. రాబోయే ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల శిక్షణను అందించాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. తద్వారా దేశ యువత ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారన్నారు.

Advertisement

 

యువత కోసం ఉచిత కోచింగ్, ఏఐ ట్రైనింగ్

విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవడానికి కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఆన్‌లైన్ విద్య ముఖ్యమైన భాగంగా మారిన తరుణంలో ఈ చర్య తీసుకున్నట్లు కనిపిస్తోంది. కృత్రిమ మేధపై దృష్టి సారించడం అనేది విద్య-ఉపాధిలో సాంకేతిక నైపుణ్యాల ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును గుర్తు చేసింది. ఆ రెండు ప్రకటనలు విద్య అవకాశాలు-భవిష్యత్ ఉపాధి అవకాశాలు అనే రెండు అంశాలను ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. ఉచిత కోచింగ్ నెట్‌వర్క్ ప్రారంభ కాలపరిమితి, పాల్గొనే సంస్థలు, కోర్సులు-అర్హత ప్రమాణాలతో సహా దాని వివరాలు, దానిపై మరింత స్పష్టత రానుంది.

ALSO READ: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వరుసగా 13వ సారి

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×