E-Paper
Advertisement

సింధూ జలాలపై పాక్ ప్రధాని పిచ్చి ప్రేలాపనలు.. షెహబాజ్ షరీఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!

సింధూ జలాలపై పాక్ ప్రధాని పిచ్చి ప్రేలాపనలు.. షెహబాజ్ షరీఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Indus Waters: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పీఎం షెహబాజ్ షరీఫ్ ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కారు. సింధూ జలాల్లో తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టూ రెడ్‌లైన్ అని ప్రకటించారు. తమ నీటి హక్కులను కాలరాస్తే.. గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. సింధూ జలాల విడుదలపై.. భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, గట్టిగా బదులిస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని.. దానిని వారి బలహీనతగా చూడొద్దని కూడా అన్నారు. 2025 మే నాటి కంటే.. గట్టిగా బదులిస్తామని పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఆనాటి ఘర్షణల్లో తామే గెలిచామని అడ్డగోలుగా అసత్యాలు వల్లెవేశారు. అందువల్లే సింధూ జలాలని.. భారత్‌ ఏకపక్షంగా నిలిపివేసిందని నిరాధార ఆరోపణలు చేశారు.

భారత్ వైఖరికి విరుద్దంగా పాకిస్థాన్..

Advertisement

పాకిస్థాన్.. భారత్ వైఖరికి పూర్తి విరుద్ధంగా వాదిస్తోంది. 2025 ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపితేనే.. సింధూ జలాల అంశంపై మాట్లాడతామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే.. దాన్ని రద్దు చేసే హక్కు సార్వభౌమ దేశంగా భారత్‌కు ఉందని కేంద్రం తేల్చేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. పాకిస్థాన్‌లో వ్యవసాయంతో పాటు తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సింధూ జలాలను విడుదల చేయాలని పదే పదే పాక్ డిమాండ్ చేస్తోంది. అయితే, నీరు రక్తం కలిసి ప్రవహించలేవని, సీమాంతర ఉగ్రదాడులను ఆపితేనే.. ఈ అంశంపై ఆలోచిస్తామని ఇండియా ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పాక్ నేతలు ఎన్ని అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా.. భారత్ బదులిచ్చేది ఒకటే.. ముందు ఉగ్రవాదం ఆపాలి. ఆ తర్వాతే.. సింధూ జలాలపై చర్చ జరగాలి.

Also Read: ముందు ఇండియాకు రా.. ఆ తర్వాతే విచారణ! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్!

Tags

Related News

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

Big Stories

Advertisement
×