E-Paper
Advertisement

రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!

రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!
Advertisement

Ayodhya: స్వేచ్ఛ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఉదంతంలో సోమవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆ అవసరం లేదని పేర్కొంది. మరోవైపు విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్ట్​ అయిన నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని అయోధ్య బార్​ అసోసియేషన్​ తీర్మానం చేసింది.

అత్యవసర విచారణ కోరుతూ..

Advertisement

రామ మందిరం నిర్మాణానికి వచ్చిన విరాళాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వీటిపై అత్యవసర విచారణ జరపాలని ఇటీవల ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన విరాళాల్లో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నాడు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరాడు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని అభ్యర్థించాడు. దీనిపై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ అంశంలో అత్యవసర ప్రాతిపదికన వెంటనే విచారణ ప్రారంభించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. కోర్టు సెలవులు ముగిసిన తరువాత ఈ కేసును రెగ్యులర్​ బెంచ్​ ముందు విచారణకు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్

Advertisement

బార్​ అసోసియేషన్​ కీలక నిర్ణయం..

ఇదిలా ఉండగా విరాళాల దుర్వినియోగం అంశంలో అయోధ్య బార్​ అసోసియేషన్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల తరపున బార్​ అసోసియేషన్​ లో సభ్యునిగా ఉన్న ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే వారికి 5లక్షల జరిమానా విధిస్తామని బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడు కాళికా శరణ్​ మిశ్రా హెచ్చరించారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన రోజే జరిపిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం ఆరోపణలతో తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని బార్ అసోసియేషన్ తెలిపింది. అందువల్లే సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంది.

Related News

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

ఇద్దరు అమ్మాయిలు-ఆటో డ్రైవర్‌కు మధ్య ఫైటింగ్, బెంగుళూరులో ఘటన, వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×