BigTV English

Maha Kumbh Mela : మహా కుంభమేళాతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం.. రూ.7500 కోట్ల బడ్జెట్

Maha Kumbh Mela : మహా కుంభమేళాతో రూ.2 లక్షల కోట్ల ఆదాయం.. రూ.7500 కోట్ల బడ్జెట్

Maha Kumbh Mela Revenue : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా ఈసారి మరింత విస్తృతంగా జరగనుంది. ఈ కార్యక్రమం వల్ల మొత్తం రూ. 2 లక్షల కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ మహా ఉత్సవం ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు కొనసాగనుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరుకానున్నారని ప్రభుత్వం ప్రకటించింది.


మహా కుంభమేళా ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం

బడ్జెట్, ఆర్థిక లావాదేవీల అంచనా
కుంభమేళాకు వచ్చే భక్తులు సగటున ఒక్కొక్కరు రూ. 5,000 వరకు ఖర్చు చేస్తారని అంచనా. దీనివల్ల కుంభమేళా నిర్వహణ ప్రాంతంలో అనేక రంగాల్లో భారీ వ్యాపార లావాదేవీలు జరగనున్నాయి. ఈ సారి మహాకుంభమేళా కావడంతో 144 సంవత్సరాలకు ఒక్కాసరి వచ్చే ఈ మహా వేడుక కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.7500 కోట్ల భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసింది.

2024-25 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో మహాకుంభమేళా కోసం ముందుగా రూ.2500 కోట్లు కేటాయించారు. అయితే కుంభ మేళా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.2100 కోట్లు గ్రాంట్స్ రూపంలో అందించింది. కానీ ఖర్చులు పెరిగిపోవడంతో ఆ తరువాత బడ్జెట్ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరిన్ని నిధులు మంజూరు చేశారు.


కుంభ మేళా నోడాల్ ఆఫీసర్ విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. కుంభమేళా వేడుకల సందర్భంగా పన్నులు, రెంటల్స్, ఇతర మార్గాల ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం రూ.25,000 కోట్లు ఆదాయం సమకూరునుంది. కానీ మేళా సమయంలో ఆర్థిక లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగనున్నాయని రిపోర్ట్ లు అందాయి. దీంతో ప్రభుత్వ ఆదాయం రూ.లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు చేరవచ్చు.

Also Read: 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా.. ఈ ఆధ్యాత్మిక సంగమం విశిష్టత తెలుసా?..

వసతి మరియు భోజనం:
భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్థానిక హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాస సముదాయాల ద్వారా రూ. 40,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదనంగా, ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూస్‌లు, భోజనం వంటి వాటి ద్వారా రూ. 20,000 కోట్ల వ్యాపారం జరగనుంది.

దైవారాధన సామగ్రి విక్రయాలు:
పూజా సామగ్రి, గంగానీరు, నూనె, దీపాలు, దేవతా విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వస్తువుల రూపంలో రూ. 20,000 కోట్ల లావాదేవీలు జరగనున్నాయి.

ప్రయాణ సదుపాయాల ద్వారా:
ట్యాక్సీలు, సరకు రవాణా సేవలు వంటి వాటి ద్వారా రూ. 10,000 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. టూరిస్ట్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, ఇ-టికెటింగ్ వంటి సేవల ద్వారా కూడా రూ. 10,000 కోట్లు లావాదేవీలు జరగనున్నాయి.

ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ సేవలు:
ఆరోగ్య సేవలు రూ. 3,000 కోట్లు, డిజిటల్ చెల్లింపులు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు వంటి ఇతర సేవల ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా.

2019 అర్ధ కుంభమేళా ఫలితాలు
2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడంతో, ఆదాయం రెట్టింపుకి చేరుకునే అవకాశముంది.

విదేశీ భక్తులు
మహా కుంభమేళాకు ఈసారి 15 లక్షల మంది విదేశీ భక్తులు కూడా హాజరుకానున్నారు. వారి కోసం 1,50,000 టెంట్లు, 3,000 వంటశాలలు, 1,45,000 విశ్రాంతి గదులు, అలాగే 99 పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత కోసం 40,000 మంది పోలీసులు, భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధ (AI) ఆధారిత కెమెరాలతో పర్యవేక్షణ కూడా నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక రైళ్లతో రవాణా సౌకర్యం
భారతీయ రైల్వే ప్రయాగ్‌రాజ్‌ ప్రయాణికుల కోసం 100 ప్రత్యేక రైళ్లతో 3,300 ట్రిప్పులు నిర్వహించబోతోంది.

ఆర్థిక ప్రభావం
కుంభమేళాకు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు సగటున రూ. 10,000 వరకు ఖర్చు చేసే అవకాశముంది. దీంతో మొత్తం ఆర్థిక లావాదేవీలు రూ. 4 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా భారతదేశ వాస్తవిక జీడీపీ 1 శాతం పెరుగుతుందని అంచనా.

ఆధ్యాత్మికతతో పాటు..  ఈ మహా కుంభమేళా ఆర్థిక పురోగతికి కూడా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×