BigTV English

Pakistan Spy Coast Guard: రూ.200 కోసం దేశద్రోహం చేసిన భారతీయుడు.. పాకిస్తాన్‌కు అమ్ముడుపోయాడు

Pakistan Spy Coast Guard: రూ.200 కోసం దేశద్రోహం చేసిన భారతీయుడు.. పాకిస్తాన్‌కు అమ్ముడుపోయాడు

Pakistan Spy Coast Guard| దేశంలో కొద్దిపాటి డబ్బు కోసం కూడా తన ఆత్మాభిమానాన్ని అమ్ముకునేవారున్నారు. తాజాగా ఒక వ్యక్తి కేవలం రూ.200 కోసం దేశ ద్రోహం చేశాడు. భారత దేశానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్న ఒక వ్యక్తిని అధికారలు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే. గుజరాత్ ద్వారకా నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే దీపేశ్ గోహిల్ అనే వ్యక్తిని గుజరాత్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఉగ్రవాద నిరోధక సంస్ధ – ఎటిఎస్) అరెస్ట్ చేసింది. ద్వారకలోని ఓఖా ప్రాంతంలో దీపేశ్ రహస్యంగా ఫొటోలు తీసి పాకిస్తాన్‌కు చేరవేస్తున్నాడాని ఎటిఎస్ అధికారులు తెలిపారు.

ఓఖా ప్రాంతంలో సముద్ర వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ కదలికలను గమినిస్తూ వాటిని ఫొటోలు తీసి పాకిస్తాన్ నావల్ ఆఫీసర్ అసీమాకు ఆన్ లైన్ ద్వారా పంపిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఎటిఎస్ అధికారులు వెల్లడించారు. ఈ రహస్య సమాచారాన్ని చేర వేసేందుకు వాట్సాప్, ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్స్ ని దీపేశ్ ఉపయోగించేవాడు.


Also Read:  3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని

దీపేశ్ అరెస్టు గురించి ఎటిఎస్ అధికారి కె సిద్ధార్థ మాట్లాడుతూ.. “ఓఖా ప్రాంతం నుంచి ఒక వ్యక్తి.. కోస్ట్ గార్డ్ కదలికల గురించి రహస్యంగా పాకిస్తాన్ నేవి అధికారికి వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. మేము విచారణ ప్రారంభించాం. ఓఖా ప్రాంతంలో నివసించే దీపేశ్.. ఓఖా పోర్టులో కోస్ట్ గార్డ్ షిప్పులకు సునాయాసంగా ప్రవేశం పొందాడు. పోర్టులో చాలా మంది గురించి మేము విచారణ చేశాం. చివరగా దీపేశ్ పైనే ఎక్కువ అనుమానం కలిగింది. అతడి గురించి వివరాలు సేకరించగా.. అతను పాకిస్తాన్ తో ఎవరితోనో సంప్రదిస్తున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి పాకిస్తాన్ నేవీలో పనిచేస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ (Inter-Services Intelligence) అధికారి అసీమా అని తేలింది. దీంతో దీపేశ్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించాం. ఆశ్చర్యకరంగా దీపేశ్ పేరుతో ఎటువంటి బ్యాంక్ అకౌంట్లు లేవు. కానీ దీపేశ్ మాత్రం తన స్నేహితుడికి బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి పాకిస్తాన్ నుంచి డబ్బులు పొందేవాడు. ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి సమాచారం అందించినందుకు దీపేశ్ కు నిత్యం రూ.200 అందేవి. గత 7 ఏడు నెలలుగా పాకిస్తాన్ అధికారి సీమా నుంచి దీపేశ్ కు రూ.42,000 అందాయి. ఈ పని చేయడం నేరమని తెలిసే దీపేశ్ చేశాడు. ” అని ఆయన చెప్పారు.

దీపేశ్ పై భారత న్యాయ సంహిత సెక్షన్ 61, సెక్షన్ 148 క్రిమినల్ కాన్సిరెసి (కుట్ర), దేశద్రోహం కేసు నమోదు చేశామని ఎటిఎస్ ఎస్‌పి కె సిద్ధార్థ తెలిపారు.

Related News

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×