BigTV English

Gujrat News : సముద్ర తీరంలో కుప్పకూలిన హెలికాఫ్టర్.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Gujrat News : సముద్ర తీరంలో కుప్పకూలిన హెలికాఫ్టర్.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Gujrat News : ఆదివారం నాడు గుజరాతా రాష్ట్రంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కోస్ట్ గార్టు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుపుతున్నారు.


గుజరాత్ లోని పోర్ బందర్ కోస్ట్ గార్డు ఎయిర్ పోర్టు నుంచి కొత్తగా రిక్రూట్ అయిన సిబ్బందికి శిక్షణ నిమిత్తం బయలుదేరిన  ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన హెలికాఫ్టర్ అనుకోని ప్రమాదానికి గురైంది. కాగా.. ఇందులో శిక్షణ పొందుతున్న సిబ్బంది సహా కోస్ట్ గార్డుకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. కుప్పకూలిన హెలికాఫ్టర్  అడ్వాన్స్ డ్ లైట్ హెలికాఫ్టర్ (ఎఎల్ హెచ్) అని తెలిపిన అధికారులు.. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించినట్లు తెలిపారు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు సిబ్బంది మరణించినట్లు స్థానికులు తెలుపగా.. ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ హెలికాఫ్టర్ సాధారణ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైనట్లు మాత్రం తెలిపారు.


హెలికాఫ్టర్ ఏఎల్ హెచ్ ధ్రువ్ ప్రమాదానికి గురైన విషయం తెలియడంతో వెనువెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా.. ఈ విషయంపై అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

భారత్ తయారీ హెలికాఫ్టర్ ఈ ధ్రువ్

ALH ధ్రువ్ హెలికాఫ్టర్ ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)  అభివృద్ధి చేసింది. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో మల్టిపుల్ విధులు నిర్వహించేందుకు దీన్ని రూపొందించారు.  రెండు ఇంజన్లతో తయారు చేసిన ఈ హెలికాఫ్టర్ ను.. సైనిక, పౌర అవసరాలకు విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఈ ధ్రువ్ హెలికాఫ్టర్ ను 2002 లో రక్షణ రంగ దళాల్లోకి ప్రవేశపెట్టారు. ఇది పౌర, సామగ్రి రవాణా, రెస్క్యూ, వైద్య తరలింపు, నిఘా వంటి అనేక రకాల మిషన్లు చేయగల సామర్థ్యం దీని సొంతం.

ఆర్మీ, నేవీ,  ఎయిర్ ఫోర్స్‌తో సహా భారత సాయుధ దళాలు ధృవ్‌ను వివిధ స్థాయిల్లో, వేరువేరు అవసరాలకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇది నేపాల్, మారిషస్, మాల్దీవులతో సహా అనేక దేశాలకు కూడా ఎగుమతి చేయగా.. అక్కడ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోంది. హెలికాప్టర్ సామర్థ్యం, డిజైన్, దీని విశ్వసనీయత, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం భారతదేశ రక్షణ, అత్యవసర సేవలకు కీలకంగా మారింది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×