OTT Movie : ఎంగేజింగ్ స్టోరీ, గ్రిప్పింగ్ నరేషన్, ఊహించని మలుపులు ఉంటే అంతకన్నా మూవీ లవర్స్ కు ఇంకేం కావాలి. ఇవన్నీ ఉండే సినిమాలే సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్. మరి ఈ జానర్లో వచ్చే సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒకవేళ మీరు గనుక ఇలాంటి సినిమాల కోసమే ఓటీటీలో వెతుకుతూ ఉంటే, ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏంటి? కథ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
చెన్నైలో ఒక మహిళ తన అపార్ట్‌మెంట్ నుండి దూకి చనిపోతుంది. మరొవైపు ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ (భరత్), ఒక హార్డ్‌వర్కింగ్ పోలీసు ఆఫీసర్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఆయన ఈ మరణాన్ని ఆత్మహత్యగా భావిస్తాడు. అతను తన సీనియర్ ACP జార్జ్ (సురేష్ చంద్ర మీనన్)తో కలిసి కేసును విచారిస్తాడు. కానీ కొన్ని రోజుల్లో ఇలాంటి మరిన్ని మరణాలు జరుగుతాయి. మహిళలు ఒకే విధంగా బిల్డింగ్‌ల నుండి దూకి చనిపోవడం అన్నది కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇవి ఆత్మహత్యలు కాదని, సీరియల్ కిల్లింగ్‌లని కాళిదాస్ అనుమానిస్తాడు.
కాళిదాస్ ఈ కేసును మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అయితే అప్పటికే మరణించిన మహిళల మధ్య కొన్ని వింత కనెక్షన్లు కనిపెడతాడు. వారంతా ఒకే స్పా/పార్లర్‌కు వెళ్లారని, వారి మరణాలు బ్లూ వేల్ ఛాలెంజ్ లేదా వివాహేతర సంబంధాలతో సంబంధం కలిగి ఉన్నాయని గుర్తిస్తాడు. శాంతి అనే అమ్మాయి ఈ కేసులో కీలకమైనదని అనుమానిస్తాడు. ఓ కంట కనిపెట్టినపప్పటికీ ఆమె తప్పించుకుని పారిపోతుంది. ఆ తరువాత చనిపోతుంది కూడా.
ఓవైపు ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంత బిజీగా ఉన్న కాళిదాస్ పర్సనల్ లైఫ్ లో కూడా సమస్యలను ఫేస్ చేస్తాడు. అతని భార్య విద్యా (అన్ షీటల్)తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతాడు. అందువల్ల ఆమె ఒంటరిగా ఫీల్ అవుతుంది. అంతేకాదు తమ ఇంట్లో రెంట్ కు ఉంటున్న ఆధవ్ కన్నడాసన్ తో సన్నిహితంగా ఉంటుంది. అతను ఆమె కాలేజీ రోజుల్లోని ప్రేమను గుర్తు చేస్తాడు. కాళిదాస్ కు అతనిపై అనుమానం మొదలవుతుంది. మరోవైపు కేసు విచారణలో ఓ కీలక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. విద్యా, శాంతి ఒకే పార్లర్ కు వెళ్లారన్న షాకింగ్ నిజం బయట పడుతుంది. దీంతో ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ తన భార్య అని అనుకున్న హీరోకి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? హీరోకి తన భార్య గురించి తెలిసిన ఆ ఊహించని నిజం ఏంటి? క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే ఈ మూవీని తెరపై చూడాల్సిందే.
ఏ ఓటీటీలో ఉందంటే ?
ఈ తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Kaalidas’. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీకి శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించారు. ఇందులో భరత్ శ్రీనివాసన్, అన్ షీటల్, సురేష్ చంద్ర మీనన్, ఆధవ్ కన్నడాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఒక పోలీసు అధికారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లోని సంఘర్షణలు, మెంటల్ హెల్త్, మ్యారేజ్ ఇష్యూస్ వంటి సమస్యలను చర్చించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video, zee 5 ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతోంది.