E-Paper
Advertisement

ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!

ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!
Advertisement

Green Roofs: ప్రస్తుతం నగరాల్లో ఉక్కపోత క్రమంగా పెరిగిపోతోంది. పగటిపూట నిప్పులు చెరిగే ఎండల వల్ల రహదారులు, కాంక్రీట్ భవనాలు విపరీతంగా వేడెక్కి.. ఆ వేడిని రాత్రి వేళల్లో బయటకు వదులుతున్నాయి. దీంతో నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఈ సమస్యకు ఓ ప్రకృతి సిద్ధమైన పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. అదే భవనాలపై పెంపొందించే ‘గ్రీన్ రూఫ్‌’లు. వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తగ్గుతున్న ఉష్ణోగ్రత

సాధారణ కాంక్రీట్ పైకప్పులతో పోలిస్తే మొక్కలతో కూడిన పచ్చని పైకప్పులు భవనాల ఉష్ణోగ్రతను ఏకంగా 30 నుండి 40 డిగ్రీల ఫారెన్‌హీట్ (సుమారు 16 నుంచి 22 డిగ్రీల సెల్సియస్) వరకు తగ్గిస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటలీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. వేసవిలో సాధారణ రూఫ్ ఉష్ణోగ్రత 74.3° సెల్సియస్‌కు చేరగా.. పచ్చదనంతో నిండిన పైకప్పులు ఆ వేడిని 57 నుండి 63 శాతం వరకు అడ్డుకోగలిగాయి.

చల్లదనానికి కారణం ఇదే

Advertisement

ఈ గ్రీన్ రూఫ్‌ల పనితీరు వెనుక సహజ సిద్ధమైన ప్రక్రియలు దాగున్నాయి. మొదటిది శీతలీకరణ (షాడోయింగ్) కాగా.. రెండోది ‘భాష్పోత్సేకం’. మొక్కల ఆకులు సూర్యరశ్మి నేరుగా భవనంపై పడకుండా నీడను ఇస్తాయి. అదే సమయంలో మట్టిలోని తేమ, మొక్కల్లోని నీరు ఆవిరై గాల్లోకి చేరడం వల్ల భవనంతో పాటు చుట్టుపక్కల పరిసరాలు కూడా చల్లబడుతున్నాయి. దీనివల్ల ఏసీల వినియోగం తగ్గి, విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

రెండు రకాల పచ్చటి పైకప్పులు

భవనం దృఢత్వం, బడ్జెట్ ఆధారంగా గ్రీన్ రూఫ్‌లను ప్రధానంగా రెండు రకాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో ఒకటి ‘ఎక్స్‌టెన్సివ్ గ్రీన్ రూఫ్’. ఇవి తక్కువ బరువు, సన్నని మట్టి పొరతో ఉంటాయి. తక్కువ నీటితో బతికే మొక్కలను ఇక్కడ పెంచుతారు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. రెండోది ‘ఇంటెన్సివ్ గ్రీన్ రూఫ్’. ఇవి కాస్త భారీ మట్టి పొరతో పెద్ద పెద్ద మొక్కలు, చెట్లతో కూడిన చిన్నపాటి గార్డెన్‌లా ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ వ్యయం, భవనానికి బలమైన పునాది అవసరం.

Advertisement

Also Read: విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని

వర్షపు నీటి నిర్వహణ, జీవవైవిధ్యం

ఈ పచ్చని పైకప్పులు కేవలం చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, కుండపోత వర్షాలు పడినప్పుడు నీటిని పీల్చుకుని, డ్రైనేజీ వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా నగరాల్లో కనుమరుగవుతున్న సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వివిధ రకాల పక్షులకు ఇవి సురక్షితమైన ఆవాసాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో గ్రీన్ రూఫ్ నిర్మాణానికి కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ ఇంట్లో ఏసీలు, కూలర్ల అసరాన్ని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

Tags

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

Big Stories

Advertisement
×