BigTV English

IAF Officer Shivangi Singh: పాక్ చెరలో ఇండియన్ మహిళా పైలట్.. నిజమేనా?

IAF Officer Shivangi Singh: పాక్ చెరలో ఇండియన్ మహిళా పైలట్.. నిజమేనా?

Pakistan Detain IAF Officer Shivangi Singh| ఇండియాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక మహిళా పైలట్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసిందని ఆమె పేరు స్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ అని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఒక వార్త వైరల్ అవుతోంది.


అయితే ఆమె అరెస్ట్ గురంచి ఇరు దేశాల ప్రభుత్వాలు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల గురించి చాలామంది ఫేక్ వార్తలు పెడుతున్నారు. అందుకే ఈ వార్తలో నిజమెంత అన్న దానిపై ఫ్యాక్ట్ చెకింగ్ జరిగింది. సోషల్ మీడియాలో శివాంగి సింగ్ ని పాకిస్తాన్ అరెస్ట్ చేసిందని వస్తున్న పోస్ట్‌లో ఈ విధంగా ఉంది. “భారత వైమానిక దళానికి చెందిన ఒక మహిళా పైలట్ అయిన స్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ప్రయాణిస్తున్న ఫైటర్ జెట్ ని పాకిస్తాన్ సైన్యం కూల్చివేయగా.. అందులో నుంచి శివాంగి సింగ్ తన ప్రాణాలు కాపాడుకునేందుకు దూకేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. ఒక్కప్పుడు ఇండియన్ పైలట్ అభినందన్ బింద్రాని పాకిస్తాన్ సైన్యం తమ భూభాగంలోకి వచ్చినందుకు అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఇంకొక పైలట్ ను పట్టుకున్నారు. ఇంతకీ టీ తాగు తారా?” అని ఆ యూజర్ పోస్ట్ పెట్టాడు.

ఆ తరువాత అదే పాకిస్తానీ యూజర్ మరో పోస్ట్ పెట్టాడు. “ఆమె ఒక మహిళా పైలట్ కావడంతో పాకిస్తాన్ ఆమెతో చాలా మర్యాదగా వ్యవహరిస్తుంది. మేము ఇస్లాం మతాన్ని అనుసరించేవాళ్లం. మహిళలను గౌరవ భావంతో ప్రవర్తిస్తాం. మరోసారి పాకిస్తాన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.” అని రాశాడు. ఈ పోస్ట్ పై అధికారిక సమాచారం లేకపోవడంతో ప్రెస్ ఇన్‌ఫర్మెషన్ బ్యూరో (పిఐబి) దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. దీంతో శివాంగి సింగ్ అరెస్ట్ వార్త అంతా ఫేక్ అని తేలింది.


“పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా యూజర్లు ఫేక్ వార్తలు వ్యాపిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ ని పాకిస్తాన్ అరెస్ట చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అంతా ఫేక్” అని పిఐబి తెలిపింది.

లెఫ్టినెంట్ శివాంగి సింగ్ ఇండియన్ నేవిలో ఫైటర్ జెట్ పైలట్ గా సేవలు అందిస్తున్నారు. ఆమె బిహార్ రాష్ట్రం, ముఖఫర్ పూర్ జిల్లాకు చెందిన ఫతేహాబాద్ గ్రామానికి చెందినవారు. ఇంతకుముందు ఆమె పిలాటస్ యుద్ధ విమానం పైలట్ గా చేశారు. ఆమె ఇండియన్ నేవీకి చెందిన మహిళ మొదటి బ్యాచ్ పైలట్స్ లో ఒకరు. ముగ్గురు మహిళా పైలట్ల బ్యాచ్ లో శివాంగి సింగ్ తో పాుట శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ దివ్యా శర్మ ఉన్నారు.

Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..

పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియా వైమానిక దాడులు చేసింది. ఆ తరువాత నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోంది.ఈ ఫేక్ న్యూస్ ని పిఐబి ఎప్పటికప్పుడు ఫ్యాక్ చెక్ చేసి నిజాలు బయటపెడుతోంది. చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వస్తున్న ఫేక్ న్యూస్ లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను పిఐబి హెచ్చరించింది.

ఇలాంటి మరో ఫేక్ వార్త వ్యాపించిన ఒక సోషల్ మీడియా యూజర్ తన పోస్ట్ లో ఈ విధంగా రాశాడు. “ఇండియా ఎలెక్ట్రిసిటీ గ్రిడ్ ని పాకిస్తాన్ సైబర అటాక్ చేసి 70 శాతం నాశనం చేసింది.” అని ఫేక్ న్యూస్ పోస్ట్ పెట్టాడు.

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×