BigTV English

India Monsoon Report: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!

India Monsoon Report: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!

Early Monsoon with More Rain to India Says IMD: భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సంవృద్ధిగా వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కారణంగా రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో కర్ణాకట రాష్ట్రంలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా నీటి ఎద్దడి నెలకొంది. ఈ తరుణంలో రాబోయే వర్షా కాలంలో వర్షాలు కురుస్తాయా..? లేదా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది.

జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడితే గతేడాది కంటే ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే విధంగా బలమైన రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


హిందూ మహాసముద్రంలో ద్విధ్రువ పరిస్థితులతో పాటుగా లా నినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవ్వడంతో రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు అల్పపీడనాలు పశ్చిమ, వాయువ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రం మీదుగా విస్తరించి ఉంటాయని తెలిపింది.

Also Read: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

దీంతో సముద్రమట్టాలు కూడా పెరుగుతాయని వెల్లడించింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని.. దీంతో దేశంలో సాధారణ వర్షానికి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×