BigTV English

Operation Sindoor : ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లతో.. మోదీ ఏం మెసేజ్ ఇచ్చినట్టు?

Operation Sindoor : ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లతో.. మోదీ ఏం మెసేజ్ ఇచ్చినట్టు?

Operation Sindoor : ఏప్రిల్ 22. పహల్గాంలోని బైసరన్ వ్యాలీ. పర్యాటకులంతా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఊడిపడింది సైతాన్ బ్యాచ్. హిందువులను, ముస్లింలను వేరు చేశారు. పేరు, ఐడీ కార్డు అడిగి మరీ.. సెలెక్టివ్‌గా హిందువులనే కాల్చి చంపారు. అందులోనూ మహిళలను, పిల్లలను వదిలేశారు. అలా ఆడవారిని వదిలేసి తామేదో ఘనకార్యం చేసినట్టు.. సానుభూతి పొందాలని చూశారు ఉగ్రవాదులు. పాపం ఆ మహిళలు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులను హతమార్చడం చూసి బతికున్న శవాలుగా మిగిలారు. ఆ ఘాతుకం వారిని జీవితాంతం వెంటాడుతుంది. క్షణక్షణం మానసిక క్షోభ అనుభవించేలా చేస్తోంది. మహిళల విషయంలో అంతటి కిరాతకంగా వ్యవహరించారు ఆ ముష్కరులు. వారి నుదిట సిందూరాన్ని తుడిచేవారు ఆ సైతాన్లు. అయితే, ఆపరేషన్ సిందూర్‌తో ఆ మహిళలకు గౌరవంగా రక్త సిందూరం అద్దినట్టు అయింది. పాక్ గడ్డపై దాడి చేసి.. ఉగ్రమూకలను హతమార్చి.. ఆ బాధిత మహిళలకు కాస్త ఓదార్పు అందించారు ప్రధాని మోదీ. అదే సమయంలో నారీ శక్తిని చాటుతూ మరో పని కూడా చేశారు.


వారితోనే బ్రీఫింగ్ ఎందుకంటే..

అపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ చేపట్టిన ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ప్రపంచానికి అధికారికంగా ప్రకటించారు ఇద్దరు మహిళా అధికారులు. వారి నోటి నుంచే భద్రతా బలగాలు ఎప్పుడు దాడి చేశాయి? ఎలా అటాక్ చేశాయి? ఉగ్ర స్థావరాలను ఎలా స్మాష్ చేశాయి? అనే సమాచారం వెల్లడైంది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆ ఇద్దరు మహిళా అధికారులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. వారి ఎంపిక వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. ఏ మహిళలను అయితే ఉగ్రవాదులు బలహీనులుగా భావించారో.. వారికి నారీశక్తి సామర్థ్యం తెలియజెప్పేలా కావాలనే ఆ పవర్‌ఫుల్ లేడీ ఆఫీసర్లతో ఉగ్రమూకలను హతమార్చిన డీటైల్స్ చెప్పించారని అంటున్నారు.


వ్యోమికా సింగ్ స్పెషాలిటీ ఇదే..

కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. భద్రతా బలగాలకు చెందిన ఈ ఇద్దరు ప్రతినిధులు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా ఆర్మీ లైఫ్‌ను స్టార్ట్ చేశారు. 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్‌ హోదా పొందారు. జమ్ము కశ్మీర్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఆమె సొంతం.

Also Read : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలుసా? మొనగాడ్రా బుజ్జీ..

సోఫియా ఖురేషి ఎవరంటే..

కల్నల్ సోఫియా ఖురేషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన సోషియా.. బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. 1990ల్లో ఆర్మీలో చేరిన సోఫియా.. ఆర్మీ సిగ్నల్ కార్ఫ్స్‌లో పని చేశారు. అనేక దేశాల్లో పీస్‌ కీపర్‌గా పనిచేశారు. 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. 2016లో పుణెలో అనేక దేశాల ఆర్మీలు నిర్వహించిన ఎక్సర్‌సైజ్ 18లో.. ఇండియన్ ఆర్మీ గ్రూప్‌ను లీడ్ చేశారు సోఫియా. 18 దేశాలు ఇందులో పాల్గొంటే.. ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా సోల్జర్ లీడ్ చేశారు. లేటెస్ట్‌గా ఆపరేషన్ సిందూర్‌ను బ్రీఫింగ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×