DSC Crash Course: ఆఖరు తేదీకి 4 రోజులే గడువు.. మీరు అప్లై చేశారా.. లేకుంటే ఇప్పుడే అప్లై చేయండి.. అప్లై చేయకుంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఇంతకు లాస్ట్ డేట్ దేనికి? ఎవరు అప్లై చేయాలనే విషయాలు తెలుసుకుందాం.
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సుమారు 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మెగా డీఎస్సీలో తమ ప్రతిభను పరీక్షించుకొనేందుకు అభ్యర్థులు దరఖాస్తులను సమర్పిస్తున్నారు. అంతేకాదు ఎందరో అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ పొందుతున్నారు. కొందరు లక్షలు ఖర్చు పెట్టి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. జూన్ 6 నుండి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఫ్రీ కోచింగ్..
ఏపీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో అర్హత ఉన్న వారికి ఇప్పటికే ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇస్తోంది. ప్రధానంగా సామాన్య కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వం అండదండగా నిలవడమే ఈ ఫ్రీ కోచింగ్ లక్ష్యం. అయితే తాజాగా మరికొంత మందికి ఫ్రీ కోచింగ్ కు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
తాజా ప్రకటన ఇదే..
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంధర్భంగా ఉచిత మెగా DSC క్రాష్ కోర్స్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం ఉచితంగా DSC పరీక్షల క్రాష్ కోర్సును విజయవాడలో నిర్వహించనుంది. ఈ శిక్షణ ప్రత్యేకంగా దృష్టిలోపం, వినికిడి లోపం, ఆర్థోపెడిక్ సమస్యలు కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
ఎవరికి ఈ ఫ్రీ కోచింగ్..
ఈ కోర్సు SGT (Secondary Grade Teacher) పోస్టులకు అర్హత కలిగిన, కనీసం 40% శాతం వికలాంగత్వం ఉన్న అభ్యర్థుల కోసం మాత్రమే. రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులైన యువతకు ఇది అరుదైన అవకాశమని చెప్పవచ్చు.
11 వ తేదీ వరకే ఛాన్స్..
ఈ ఫ్రీ కోచింగ్ కొరకు అర్హులైన వారు ఈ నెల 11వ తేదీ లోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. అభ్యర్థులు mdfc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక TET స్కోర్ ఆధారంగా జరగనుంది.
ఫ్రీ కోచింగ్ లో అన్నీ ఫ్రీ.. ఫ్రీ
ఈ ఫ్రీ కోచింగ్ కు ఎంపికైన వారికి అన్ని సదుపాయాలను ప్రభుత్వం ఫ్రీగా కల్పిస్తుంది. ప్రత్యేక బోధనా పద్ధతుల్లో శిక్షణ, ఉచిత స్టడీ మెటీరియల్, ఉచిత భోజనం, ఉచిత వసతి సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ భవిష్యత్ కు దిక్సూచి చేసుకోవాలంటూ అధికారులు పిలుపునిస్తున్నారు.
Also Read: Operation Sindoor: వచ్చేసింది వీడియో.. టెర్రరిస్ట్ క్యాంప్‌ను ఎలా లేపేశారో చూడండి
మరెందుకు ఆలస్యం..
మీకు అర్హత ఉందా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, మీరు డీఎస్సీ ఫ్రీ కోచింగ్ తీసుకొనే ఛాన్స్ ఇదే. వెంటనే ఆలస్యం చేయకుండా, అప్లై చేయండి. ఫ్రీ కోచింగ్ తీసుకోండి. అలాగే ఎంచక్కా టీచర్ జాబ్ పెట్టేయండి.