BigTV English

Sprouted Peanuts: మొలకెత్తిన వేరుశనగ తింటే.. ఆశ్చర్యకర లాభాలు !

Sprouted Peanuts: మొలకెత్తిన వేరుశనగ తింటే.. ఆశ్చర్యకర లాభాలు !

Sprouted Peanuts: మనకు శరీరం ఉన్నంత వరకు.. మనం చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము. కానీ ప్రకృతి మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఉపయోగపడే అనేక ఆహార పదార్థాలను అందిస్తోంది. వీటిని తినడం ద్వారా మనం పూర్తిగా ఫిట్‌గా , సంతోషంగా ఉండగలుగుతాము. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే వేరుశనగ తినడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.


ఉదయాన్నే ఒక గుప్పెడు మొలకెత్తిన వేరుశెనగ గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరంలోని దాదాపు ప్రతి భాగానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గుప్పెడు మొలకెత్తిన వేరుశనగ గింజలను తింటే.. అది గుండె, ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మొత్తం శరీరానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

1. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో.. జీర్ణ సంబంధిత సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మొలకెత్తిన వేరుశనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా జీర్ణక ప్రక్రియను సజావుగా ఉంచుతుంది.


2. గుండెను బలంగా ఉంచుతుంది:
ఫైబర్, పొటాషియం , మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉన్న మొలకెత్తిన వేరుశనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం :
మధుమేహ రోగులు ప్రతిదీ జాగ్రత్తగా తినాలి. కానీ మొలకెత్తిన వేరుశనగలు వారికి ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా షుగర్ స్థాయి పెరగకుండా కాపాడుతుంది.

4. మీ ఎముకలను బలంగా చేసుకోండి:
మొలకెత్తిన వేరుశనగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, బలహీనత నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. శరీరాన్ని కూడా చురుగ్గా ఉంచుతుంది.

5. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మీరు వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే.. మీ అల్పాహారంలో మొలకెత్తిన వేరుశనగలను చేర్చుకోండి. ఇందులో ఉండే ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

6. జుట్టు ఆరోగ్యానికి మేలు:
జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తొలగించడానికి మొలకెత్తిన వేరుశనగలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్ , విటమిన్ బి ఉంటాయి. ఇవి జుట్టును బలపరుస్తాయి. అంతే కాకుండా పెరుగుదలకు సహాయపడతాయి.

Also Read: వీళ్లు.. అవకాడో అస్సలు తినకూడదు తెలుసా ?

చిన్న ప్రారంభం, పెద్ద ప్రభావం:
ప్రతిరోజూ ఒక గుప్పెడు మొలకెత్తిన వేరుశనగలు తినడం ఒక చిన్న అడుగు. కానీ దాని ప్రయోజనాలు దీర్ఘకాలంలో కనిపిస్తాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసిక సమతుల్యత , శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. మరి రేపు ఉదయం నుండే మీరు మొలకెత్తిన వేరుశనగలు తినడం అలవాటు చేసుకోండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×