Big Stories

Indian Railways Restore Ticket Fares: రైల్వే ప్రయాణికులకు ఊరట.. సెకండ్ క్లాస్, ఆర్డినరీ ఛార్జీల పునరుద్ధరణ

Indian Railways

- Advertisement -

Indian Railways Restore Ticket Fares: రైల్వే ప్రయాణికులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్ ప్రెస్ స్పెషల్ గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డనరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్దరించింది. కోవిడ్ లాక్ డౌన్ తర్వాత రైల్వే మెల్లగా ప్యాసింజర్ ట్రైన్ల పేర్లను మార్చడం మొదలు పెట్టింది.

- Advertisement -

వాటికొత్త పేర్ల ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. దీంతో కనీసం టికెట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు సమానంగా ధర రూ. 10 నుంచి రూ. 30 వరకు చేరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం రైల్వే బోర్డు సమీక్ష సమావేశం నిర్వహించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్ల కనీస టికెట్ ధరను పాత రేట్లులానే వసూలు చేయాలని ది చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ అధికారులకు మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందించింది. మెయిన్ లైన్ ఎలక్ర్టిక్ మల్టిపుల్ యూనిట్ లో ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. సాధారణంగా ఈ రైలు నెంబర్లు సున్నాతో మొదలవుతాయి. అన్ రిజర్వుడ్ ట్రాకింగ్ సిస్టమ్ లోను వీటి ధరలు అప్ డేట్ చేశారు.

గతంలో ప్యాసింజర్ రైళ్లు గా సేవలందించి ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ స్పెషల్స్ గా మారిన అన్నింటికి ఈ మార్పు వర్తిస్తుంది. అయితే జూన్ 2022లో నైరుతీ రైల్వే మొత్తం 8 ప్యాసింజర్ స్పెషల్స్ అన్ రిజర్వుడు ఎక్స్ ప్రెస్ లుగా మార్చింది. 2021 ఏప్రిల్ లో ఇదే మొత్తం 20 రైళ్లను ఎక్స్ ప్రెస్ లుగా చేర్చింది. అయితే ప్యాసింజర్ రైళ్లను 200 కిలోమీటర్ల దూరానికి మించి నిర్ణయించింది. 2020లో మొత్తం 502 ప్యాసింజర్ రైళ్లను మర్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News