BigTV English

India Vs Pakistan : పాక్‌తో ఫైట్.. చైనాను చిత్తు చేసిన భారత్.. ఇదిగో ప్రూఫ్స్

India Vs Pakistan : పాక్‌తో ఫైట్.. చైనాను చిత్తు చేసిన భారత్.. ఇదిగో ప్రూఫ్స్

India Vs Pakistan : చైనా ఆర్మీ చాలా పవర్‌ఫుల్ అంటారు. అమెరికానే ఢీకొట్టే సత్తా ఉందని చెబుతుంటారు. చాలా అడ్వాన్స్‌డ్ ఆయుధాలు డ్రాగన్ అమ్ములపొదిలో ఉన్నాయంటారు. చైనాతో వార్ అంత ఈజీ కాదని కూడా భయపడుతుంటారు. కానీ.. ప్రచారం వేరు, రియాలిటీ డిఫరెంట్. చైనా ఆయుధ సంపత్తిని చిత్తుచిత్తుగా స్మాష్ చేసి పడేసింది ఇండియన్ ఆర్మీ. పాక్‌తో జరుగుతున్న యుద్ధంలో.. చైనా లేటెస్ట్ టెక్నాలజీని కూల్చిపడేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా.. ఆపరేషన్ సిందూర్‌తో ఇటు పాక్‌ను, అటు చైనాను రప్పా రప్పా అంటూ రఫ్ఫాడించింది ఇండియా. మన ఆర్మీ సత్తా చూసి ఇప్పుడిక డ్రాగన్ దేశం సైతం భయంతో హడలిపోతోంది.


పాక్ సరుకు.. చిత్తు చిత్తు..

పాకిస్తాన్ ఆర్మీ. పేరుకే పాక్ అని ఉంటుంది. కానీ, అది వాడేదంతా చైనా వెపన్సే. పాక్ అణ్వస్త్ర సాయం చేసింది కూడా డ్రాగన్ కంట్రీనే అంటారు. ఇండియా మీద కోపంతో పాపిస్తాన్‌కు అనేక రకాలైన వార్ టెక్నాలజీని అంటగట్టింది. అందులో అతిముఖ్యమైనది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. భారత్ చేసే దాడులను ముందుగా గుర్తించి, నిలువరించే వ్యవస్థ. చైనాకు చెందిన HQ9 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ వాడుతోంది. పేరుకైతే ఉంది కానీ.. అర్థరాత్రి జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో ఆ చైనా సరుకు దుప్పటికప్పుకుని నిద్రపోయినట్టుంది. చైనా మేడ్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌ను బోల్తా కొట్టించి మరీ.. మన మిస్సైళ్లు, డ్రోన్లు పాక్‌పై విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. లేటెస్ట్‌గా పాకిస్తాన్‌లోని 9 ప్రధాన నగరాలపైనా డ్రోన్లతో దాడి జరిగింది. ఇంత జరుగుతున్నా.. HQ9 తో నో యూజ్. అక్కడితోనే అయిపోలేదు సినిమా. ఈసారి లాహోర్‌లోని పాక్ ఎయిర్‌డిఫెన్స్‌పైనే డైరెక్ట్‌గా అటాక్ చేసింది మన ఆర్మీ. చైనాకు చెందిన HQ9 డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసి అప్పర్‌హ్యాండ్ సాధించింది. తమ HQ9 కు క్రూయిజ్ క్షిపణులను, బాలిస్టిక్ మిసైల్స్‌ను, ఫైటర్ జెట్స్‌ను అడ్డుకోగల సామర్థ్యం ఉందని చైనా ఇన్నాళ్లూ గొప్పలు చెబుతూ వస్తోంది. ఇప్పుడు జస్ట్ డ్రోన్ల దెబ్బకే ఆ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ అయిందంటే.. అదంతా ఉత్తుత్తి బిల్డపేనా? అంటే, మన దెబ్బకు పాక్, చైనా రెండూ ఫసక్ అన్నట్టేగా. అంతేగా.


భారత్ సూసైడ్ డ్రోన్స్‌

ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్ర స్థావరాలను కూల్చడంలో సూసైడ్‌ డ్రోన్స్‌ కీ రోల్ ప్లే చేశాయి. బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ డ్రోన్లు తయారయ్యాయి. ఇండియాకు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా డ్రోన్లను డెవలప్ చేశాయి. 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా వీటి సొంతం. 5 నుంచి 10 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలవు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా నడిచే ఈ డ్రోన్లు తక్కువ సౌండ్‌తో దూసుకెళ్తాయి. ఈ డ్రోన్లను శత్రువులు గుర్తించలేరు. తక్కువ ఎత్తులో ఆకాశంలో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని ఫినిష్ చేస్తాయి. ఈ సూసైడ్‌ డ్రోన్స్‌ని కామికేజ్‌ డ్రోన్స్‌ అంటారు.

పాక్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌తో రగిలిపోయిన పాకిస్తాన్.. భారత్‌పై రివేంజ్ అటాక్స్‌కు ట్రై చేసింది. ఇండియా సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, మిస్సైల్స్ ప్రయోగించింది. అయితే, మన దగ్గర ఉన్నది చైనా మేడ్ చెత్త సరుకు కాదు. రష్యన్ మేడ్ S 400 డిఫెన్స్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్‌ యూఏఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో పాక్‌ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే గుర్తించి పేల్చేసింది. అందుకే పాక్ ఎంత ట్రై చేసినా.. ఒక్కటంటే ఒక్క బాంబు కూడా భారత భూభాగంలో పేలలేదు.

పవర్‌ఫుల్ S 400

భారత్ ఉపయోగించిన S 400 డిఫెన్స్ సిస్టమ్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. దీనిని భారత్ సుదర్శన్‌గా పిలుస్తోంది. అదే ఇప్పుడు సుదర్శన చక్రంగా మనల్ని పాక్ దాడి నుంచి కాపాడింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగల సత్తా దీని సొంతం. ఒకేసారి 36 క్షిపణులను తిప్పికొట్టగలదు. 360 డిగ్రీలను కవర్ చేస్తూ.. ఏ కోణం నుంచైనా వచ్చే టార్గెట్స్‌ను ఛేదించగలదు. స్టెల్త్ టెక్నాలజీ ఉన్న క్షిపణులను కూడా గుర్తించి స్మాష్ చేయగలడం S400 గొప్పతనం.

Also Read : చచ్చాడు చెత్త వెదవ.. మసూద్ అజార్ సోదరుడు హతం

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×