E-Paper
Advertisement

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్‌పై బుల్డోజర్ యాక్షన్!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్‌పై బుల్డోజర్ యాక్షన్!
Advertisement

Bulldozer Action: దాయాది దేశం పాకిస్థాన్ కు భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. దిల్లీలోని ఆ దేశ హైకమిషన్ వెలుపల చేపట్టిన అక్రమ నిర్మాణాలను బోల్డోజర్ల సాయంతో తొలగించింది. పాక్ లోని భారత హై కమీషన్ నిర్మాణాలను తొలగించిన 3 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాక్ హైకమిషన్ వెలుపల భారీ ఎత్తున శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించి దృశ్యాలు వైరల్ కావడంతో.. ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

ముందస్తు అనుమతులు లేకుండా, తమ పరిధికి మించి పాక్ దౌత్య కార్యాలయం నిర్మాణాలు చేపట్టినట్లు దిల్లీ అధికారులు గుర్తించారు. దీంతో హైకమిషన్ వీసా విభాగం సమీపంలో పరిధికి వెలుపల ఉన్న క్యూ లైనర్లు, బారికేడ్లను గురువారం అధికారులు తొలగించారు. జేసీబీల సాయంతో వాటిని కూల్చివేశారు. దీంతో దెబ్బతిన్న బారికేడ్లు, గోడలు.. వాటి తాలుకా శిథిలాలతో పాక్ హైకమిషన్ ప్రస్తుతం దర్శనమిస్తోంది. అయితే ఈ కూల్చివేతకు సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అటు పాక్ హైకమిషన్ సైతం దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంది.

Advertisement

ప్రతీకారం తీర్చుకుందా?

సరిగ్గా మూడు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వెలుపల ఏర్పాటు చేసిన రక్షణ భద్రతా కంచెలను అక్కడి అధికారులు తొలగించారు. తొలగింపునకు గల కారణాలను సైతం వెల్లడించలేదు. దీనిపై అధికార వర్గాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం వెలుపుల ఈ బుల్డోజర్ యాక్షన్ జరగడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ కు దాని దారిలోనే భారత్ బుద్ధి చెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇరుదేశాల దౌత్య కార్యాలయాలపై చోటుచేసుకున్న ఈ ఘటన.. ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చకు తావిస్తోంది.

Advertisement

Also Read: భారత్‌లోకి Infinix Hot 70 Pro.. రూ.25,000 లోపు IP68 రేటింగ్, భారీ బ్యాటరీ ఫోన్!

కాశ్మీర్‌పై పాక్ రియాక్షనూ ఓ కారణమా?

అయితే దిల్లీలో ఈ కూల్చివేతలకు ఒక రోజు ముందు జమ్మూ కాశ్మీర్‌పై భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో బుధవారం పర్యటించిన ఆయన.. జమ్మూ కాశ్మీర్‌ను భారత్ లో ముఖ్యమైన భాగంగా అభివర్ణించారు. ఇక్కడ భద్రతాపరమైన చర్యలను ప్రశంసించారు. అయితే దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ లోని అమెరికా రాయబారిని పిలుపించుకొని ఈ వ్యాఖ్యల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. పాక్ చర్యకు ప్రతిచర్యగా దిల్లీలో ఈ కూల్చివేతలు చోటుచేసుకున్నాయా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Also Read: ఇక హెడ్‌సెట్ అక్కర్లేదు.. గేమింగ్ కోసం Sony Pulse Elevate 3D ఆడియో స్పీకర్లు వచ్చేశాయ్!

Tags

Related News

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

Big Stories

Advertisement
×