E-Paper
Advertisement

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..
Advertisement

Two Died of Sunstroke in Telangana : ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాలులు ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎర్రటి ఎండలో బయటికెళ్తే.. దాదాపు మృత్యువును దగ్గరగా చూసినంత పనవుతుంది. కళ్లు బైర్లు కమ్మి.. దిమ్మ తిరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు.

కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ 2 లో గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బకు మరణించాడు. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేశ్ మరణించాడు. కాగా.. గత శుక్రవారం వేములవాడ లోని అచ్చన్నపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన శంకర్ సదా వడదెబ్బ తగిలి చనిపోయాడు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ టీచర్ మృతి చెందింది.

Advertisement

Also Read : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి

వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అనవసరంగా బయట తిరగవద్దని, నీడ పట్టున ఉండాలని సూచించింది. రైతులు కూడా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో పనులు పూర్తిచేసుకోవాలని తెలిపింది.

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×