Nandan Nilekani on ChatGPT : ప్రపంచం అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఆమెరికా నుంచి చైనా వరకు ఇప్పటికే.. ఏఐ మోడళ్లను రూపొందించగా.. టెక్నాలజీ రంగంలో టాప్ కంట్రీగా ఉన్న భారత్ మాత్రం ఈ రేసులో పాల్గొనడం చాలా కష్టం అంటున్నారు. ఈ మాట అంటున్నది.. ఎవరో సాధాసీదా వ్యక్తి కాదు.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నీలేకని. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న నందన్ నీలేకన్.. దేశీయంగా ఏఐ ఆంకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయని, కానీ.. వ్యూహాత్మక పెట్టుబడులు లేకుండా దేశీయ ఏఐ మోడల్ ఆవిష్కరణ చాలా కష్టం అని తెలిపారు. ఆయన ఎందుకు అలా అన్నారు. స్వదేశీ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఉన్న ఇబ్బందులేంటి.
ఇప్పటికే అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన ఏఐ మోడళ్లను స్వదేశీయంగా నిర్మించడం చాలా ఖరీదైనదన వ్యవహారం అని నందన్ నీలేకర్ని వ్యాఖ్యానించారు. ఇందుకోసం.. దాదాపు $50 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేశారు. అయితే.. దేశీయంగా చాలా మంది ఈ ఖర్చును భరించగలిగే స్థాయిలోనే ఉన్నారని.. అయినా వ్యూహాత్మక పెట్టుబడి అవసరమని అభిప్రాయపడ్డారు. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో AI మోడళ్లను అభివృద్ధి చేయడంలోనే కాదు.. దాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించడమే అసలైన సవాళు అని అన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి విస్తృత వినియోగంలోకి తీసుకురావడం, అతితక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచడమే అసలైన సవాళు అని తేల్చి చెప్పారు.
స్వదేశీ ఏఐ మోడళ్లను ఎవరైనా నిర్మించవచ్చు. కానీ AI తో అనేక సవాళ్లు ఉన్నాయంటున్నారు నందన్ నీలేకన్. మనం దానిని ఎలా పని చేయిస్తాం.? జనాభా స్థాయిలో తగ్గట్టుగా సేవలు అందించేందుకు ఏం చేయాలి.? చౌక ధరల్లో అందుబాటులో ఉంచడం ఏలా? ఇలా.. అనేక సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. స్వేదేశీ అవసరాల్ని పరిపూర్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) తీర్చాలంటే.. చాలా సూక్ష్మ స్థాయిలోని ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలంటున్నారు. అంటే.. దేశంలోని ఓ మారుమూల గ్రామంలోని రైతు తన ఫోన్ నుంచి హిందీ, భోజ్‌పురి వంటి స్థానిక భాషల్లో మాట్లాడినా.. ఆ టెక్నాలజీ అర్థం చేసుకునేలా ఉండాలంటున్నారు. ఆ రైతుకు.. పంట ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన, ఆచరణాత్మకమైన సలహాలు అందించేలా ఉండాలన్నారు. పైగా.. ఈ సేవలన్నీ.. అతి తక్కువ ఖర్చుకే అందించాల్సి ఉంటుందంటున్నారు. పైగా.. మారుమూల భారత్ గ్రామాలకు సైతం ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అతిపెద్ద సవాళు అని చెబుతున్నారు.
Also Read : CAG Report – Liquor Policy : కళ్లు చెదిరేలా కేజ్రీవాల్ కలెక్షన్లు – ఒక్క పాలసీతో రూ.2 వేల కోట్లు మాయ
అలాగే.. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య.. ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు కోల్పోవచ్చని నీలేకన్ కూడా అభిప్రాయపడ్డారు. కానీ.. కొన్ని ఉద్యోగాలు మాత్రమే ప్రభావితమవుతాయని, అన్నీ ఉద్యోగాలు పోతాయనుకోవడం లేదని అన్నారు. ఏఐ ప్రభావం కొన్ని ఉద్యోగాలే ఉంటుందని, కొన్ని పనులు పూర్తిగా ఆటోమేటెడ్ అవుతాయని వెల్లడించారు. AI మానవ ఉత్పాదకతను పెంచుతుందని, అదే సమయంలో ఊహించలేని కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాట్లు తెలిపారు.