BigTV English

Budget MNREGA Tribal Students: బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకం, ఆదివాసీ విద్యార్థులకు అన్యాయం.. కేటాయింపుల్లో భారీ కోత

Budget MNREGA Tribal Students: బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకం, ఆదివాసీ విద్యార్థులకు అన్యాయం.. కేటాయింపుల్లో భారీ కోత

Budget MNREGA Tribal Students| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (MGNREGS) నిధులను పెంచకపోవడంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవనోపాధి విషయంలో ఉదాసీనతను చూపుతోందని, ఇది దానికి నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సంవత్సరంలో 100 రోజుల పాటు ఉపాధిని పొందుతారు, ముఖ్యంగా మహిళలు, వయోజనులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఆయన అన్నారు.


గత సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రారంభంలో రూ.60,000 కోట్లు కేటాయించగా, తర్వాత అదనపు నిధులతో మొత్తం రూ.89,153.71 కోట్లకు చేరుకుంది. కానీ 2025 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.86,000 కోట్లు మాత్రమే కేటాయించడంతో, గత సంవత్సరంతో పోలిస్తే నిధుల కేటాయింపులో ఎటువంటి పెరుగుదల లేదని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, పేద గ్రామీణ కార్మికులకు మొండి చెయ్యి చూపిస్తోందని ఆరోపించారు. ఉపాధి కార్మికుల వేతనాల పెంపు కూడా ఇప్పటికీ నెరవేరని కలగా మిగిలిపోయిందని వారు ఎత్తిచూపారు.

2025 బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.1.81 లక్షల కోట్లు కేటాయించారు, ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే 5.75 శాతం అధికం. అలాగే, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకానికి ఈ సారి రూ.19 వేల కోట్లు కేటాయించగా, ఇది గత సంవత్సరం సవరించిన కేటాయింపుల కంటే 31 శాతం ఎక్కువ. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన – గ్రామీణ్‌ పథకానికి రూ.54,832 కోట్లు కేటాయించగా, ఉపాధి హామీ పథకానికి రూ.86,000 కోట్లు కేటాయించారు.


Also Read: ఈసారి జనాభా లెక్కింపు లేనట్టేనా.. కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది

మరోవైపు కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రభుత్వం ఆదివాసీ మైనారిటీ విద్యార్థులకు లాభం చేకూర్చే విద్యా సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ -ఆదివాసీలు) జాతులకు చెందిన పేద విద్యార్థుల జాతీయ స్కాలర్‌షిప్, ఫెలోషిప్ పథకంలో గత బడ్జెట్ తో పోలీస్తే.. దాదాపు కేటాయింపులు సున్నా శాతంగా ఉన్నాయి. మొత్తం 99.99 శాతం కోత విధించారు. గత బడ్జెట్ లో మొత్తం రూ.240 కోట్లు ఎస్టీ విద్యార్థుల జాతీయ విద్యా సంక్షేమ పథకం కోసం కేటాయిస్తే.. ఈసారి కేవలం రూ.0.02కోట్లు గా ఉంది.

బడ్జెట్ కంటే ముందు ఎస్టీ, మైనారిటీ విద్యాశాఖ కమిటీ నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. పేద ఆదివాసీల కోసం ఉచిత కోచింగ్, హాస్ట్ వసతి కోసం నిధులు అవసరమని కారణాలు చూపింది. వీటికి తోడు జాతీయ ఓవర్‌సీస్ స్కాలర్ షిప్ పథకంలో కూడా 99.8 శాతం కోత విధించింది. 2024 బడ్జెట్ లో రూ.6 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రూ.0.01 కోట్లు కేటాయించింది.

అదేకాకుండా మైనారిటీలకు ఉండే ప్రీ మెట్రెక్ స్కాలర్ షిప్ కోసం 2024లో రూ.326 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రూ.90కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఏకంగా 72.4 శాతం తక్కువ. అదే విధంగా మైనారిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కేటాయింపుల్లో 69.9 శాతం తగ్గించింది. గత సంవత్సరం రూ.1145.38 కోట్ల అందిస్తే.. ఈ సారి కేవలం రూ.343.91 కోట్లు కేటాయించింది.

ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సుల్లో మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిన్ కేటాయింపుల్లో కూడా 42.6 శాతం కోత పెట్టింది. 2024లో రూ.33.8 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ.19.41 కోట్లు కేటాయించింది. మైనారిటీ విద్యార్థులకు అందే మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ లో 4.9 శాతం తగ్గించింది. మైనారిటీల కోసం అందించే ఉచిత కోచింగ్ అనుబంధ పథకాల్లో 65 శాతం తగ్గించింది. 2024లో రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఈ సారి కేవలం రూ.3.5 కోట్లతో సరిపెట్టేసింది. మద్రసల విద్యా పథకం కేటాయింపుల్లో ఏకంగా 99.5 శాతం కోత పెట్టింది.

నెల రోజుల క్రితమే కేంద్ర మైనారిటీ శాఖపై సామాజిక న్యాయం సశక్తీకరణ కోసం పనిచేసే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ మండిపడింది. నిధుల మంజూరుకు మైనారిటీ శాఖ తీవ్ర జాప్యం ఎందుకు చేస్తోందో నిలదీసింది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×