Shock to Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురించి మళ్లీ దేశంలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన్ని ఇండియాకు తీసుకొస్తారా? వనువాటు పౌరసత్వం రద్దయితే ఆయన చిక్కినట్టేనా? లలిత్ మోదీని ఇండియాకు రప్పించేందుకు మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
లలిత్ మోదీకి వనువాటు ఝలక్
లలిత్ మోడీ సిటిజన్ షిప్ రద్దు చేస్తున్నట్లు వనువాటు డైలీ పోస్ట్ వెల్లడించింది. లలిత్ మోడీకి ఎందుకు సిటిజన్ షిప్ ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే దానిపై స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ మీడియాలో ఆయన గురించి వెల్లడైన కథనాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. ఆయనకు వనువాటు ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది.
లలిత్ మోడీకి జారీ చేసిన వనువాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆదేశ ప్రధానమంత్రి జోథమ్ నపట్ సోమవారం పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. ఆయన గురించి మరింత సమాచారం త్వరలో తమ డైలీలో ప్రచురిస్తామని పేర్కొంది. ఏ ప్రకటన గురించి మాట్లాడుతున్నారో అనేది ఎక్కడా చెప్పలేదు. దీంతో లలిత్ మోదీ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.
వనువాటు డైలీ కథనం
లలిత్ మోడీ పారిపోయిన ఇండియా బిజినెస్ మేన్ అని వనువాటుకు తర్వాత తెలిసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించింది ఆ దేశ డైలీ కథనం. భారతదేశం ఒత్తిడి చేయడం వల్లే ఆయన పాస్‌పోర్టు రద్దు చేసినట్టు తెలుస్తోంది. లలిత్‌మోడీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్టు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: బీజేపీ-ఆర్ఎస్ఎస్ లు హిందువులను దోచుకుంటున్నాయి
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన పసిఫిక్ ద్వీప దేశం వనువాటులో ఉంటున్నాడు. అక్కడ పౌరసత్వం తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. వానువాటు దేశ పౌరసత్వాన్ని గోల్డెన్ పాస్‌పోర్ట్ కార్యక్రమం కింద లలిత్ మోదీ పొందారు.
కొద్దిరోజుల కిందట
ఆ దేశ పౌరసత్వం వచ్చిన తర్వాత ఇండియన్ పాస్‌పోర్టును లండన్‌లో భారత హై కమిషన్ ఆఫీసులో అప్పగించేందుకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆయన వనువాటు పౌరసత్వం పొందాడని తెలిసిందని భారత అధికారులు చెప్పారు. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ నుంచి విచారణ తప్పించుకునేందుకే వనువాటు పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వనువాటు స్పెషల్ ఏంటి?
గోల్డెన్ పాస్‌పోర్ట్ తీసుకున్నవారికి వనువాతు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. పాస్‌పోర్ట్ ద్వారా పౌరసత్వం పొందితే అక్కడ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. పన్ను మినహాయింపులు ఇవ్వడమేకాదు ఎంత సంపాదించినా సరే ట్యాక్స్ అనేది ఉండదు. స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత ఆదాయం సంపాదించినా వాటిపై పన్నులు ఉండవు.
వనువాతులో కంపెనీని రిజిస్టర్ చేసుకుని విదేశాల్లో ఉంటూ ఆదాయం పొందిలా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్ అనేవి అస్సలుండవు. క్రిప్టో హబ్‌గా ఆ దేశం వృద్ధి చెందుతుండడంతో అక్కడి గోల్డ్ వీసాకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మరోవైపు హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్-20204లో ఆ దేశం ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది కూడా.
ఐపీఎల్ ఛైర్మన్‍గా లలిత్ మోదీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2010లో ఆయన భారత్ వదిలి లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి లండన్ కేంద్రంగా ఆయన కార్యకలాపాలు సాగుతున్నాయి.
The official release by the Republic of Vanuatu, on the cancellation of Lalit Modi's passport. #LalitModi #Vanuatu https://t.co/LZMQXBUkxR pic.twitter.com/UHhhxUnlTh
— Vani Mehrotra (@vani_mehrotra) March 10, 2025