Big Stories

IT Notice to Student: స్టూడెంట్‌కి షాకిచ్చిన ఐటీ.. 46 కోట్లపై నోటీసు.. ఇదెలా?

IT Notice to student Gets ₹ 46 Crore at Madhya Pradesh

- Advertisement -

IT Notice to Student(News update today in telugu): టెక్నాలజీ పుణ్యమాని అధికారులు కూడా ఒక్కసారి బోల్తాపడుతున్నారు. ముఖ్యం గా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ స్టూడెంట్‌కి అదాయపు పన్ను, జీఎస్టీ అధికారు లు నోటీసు పంపారు. 46 కోట్ల లావాదేవీలపై ట్యాక్స్ చెల్లించాలని అందులో ప్రస్తావించింది. ఆ నోటీసు చూసి షాకవ్వడం ఆ విద్యార్థి వంతైంది. ఇంతకీ ఈ తతంగం ఎక్కడ జరిగిందో తెలుసా?

- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్‌కు నోటీసు ఇచ్చింది ఐటీ, జీఎస్టీ విభాగం. ఏడాదిగా జరుగుతున్న 46 కోట్ల లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లించాలని పేర్కొంది. నోటీసు చూసిన ఆ విద్యార్థికి నోటి వెంట మాట రాలేదు. కాసేపు తర్వాత తేరుకున్న ఆ యువకుడు.. ఇంకా నోటీసులోని ఉన్న మిగతా అంశాలను క్షుణ్నంగా చదివాడు. 25ఏళ్ల యువకుడి పేరు ప్రమోద్‌కుమార్. ప్రమోద్ పాన్‌కార్డుతో ముంబై, ఢిల్లీలో 2021 ఏడాది  ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యిందని, అందులో లావాదేవీలు నిర్వహించారని తెలిపింది.

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రమోద్‌కుమార్. తాను గ్వాలియర్‌లోని ఓ కాలేజీ చదువు తున్నానని, తన పాన్‌కార్డు ఏ విధంగా దుర్వినియోగం అయ్యిందో తనకు తెలీదన్నాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి సమాచారం అందిన వెంటనే ఆ శాఖ అధికారులను సంప్రదించినట్టు చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో శుక్రవారం ఎస్పీ ఆఫీసుకు వెళ్లాడు ప్రమోద్‌కుమార్. జరిగిన తతంగాన్ని ఏఎస్పీకి వివరించి చెప్పాడు.

ప్రమోద్ ఫిర్యాదుపై స్పందించారు ఏఎస్పీ షియాజ్. తన పాన్‌కార్డు నుంచి 46 కోట్ల రూపాయల లావా దేవీలు జరిగినట్టు ఓ యువకుడు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామన్నారు. పాన్‌కార్డు దుర్వినియోగం ద్వారా ఓ కంపెనీ రిజస్టర్ చేసి భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News