Japan Airlines: విమానాలలో వరుసగా సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాంఘై నుంచి టోక్యోకి బయలుదేరిన.. స్ప్రింగ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం షాంఘై నుంచి టేక్‌ఆఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా 26,000 అడుగుల ఎత్తు నుంచి కేవలం కొన్ని నిమిషాల్లోనే భూమికి చేరువ కావడంతో.. ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సాంకేతిక లోపమే కారణం
విమానంలోని సాంకేతిక సమస్య తలెత్తడంతో.. పైలట్లు వెంటనే అత్యవసర ప్రోటోకాల్‌ను అమలులోకి తీసుకుని.. విమానాన్ని భద్రంగా కిందకు దించడానికి చర్యలు ప్రారంభించారు. అయితే విమానం కూలిపోతుందనే భయంతో ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు తమ ఆస్తులు, భీమాలకు సంబంధించిన వివరాలు, వీలునామా పత్రాలను మెసేజ్ చేశారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి.. విమానాన్ని అత్యవసరంగా ఒసాకాలోని.. కాన్సై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేశారు.
ప్రయాణికుల భయాందోళన
విమానంలో దాదాపు 180 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా విమానం భూమికి అత్యధిక వేగంతో పడిపోవడంతో.. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు. ప్రయాణికులు స్పృహ కోల్పోయే ప్రమాదం ఉండటంతో వెంటనే స్పందించిన సిబ్బంది.. వారికి ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే సదుపాయం ఏర్పాటు చేసింది. కొంతమంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారని విమాన అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా.. పైలట్లు విమానాన్నిఅత్యవసరంగా ల్యాండ్ చేయగలిగారు.
అధికారులు స్పందన
ఘటనపై స్పందించిన జపాన్ సివిల్ ఏవియేషన్ అధికారులు.. వెంటనే రన్‌వే క్లీన్ చేసి, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అనుమతించారు. విమానంలోని సాంకేతిక లోపానికి గల కారణాలను తెలుసుకోవడానికి.. ఇప్పటికే విచారణ ప్రారంభమైందని స్ప్రింగ్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
స్ప్రింగ్ ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఈ ఘటనపై స్పందించిన స్ప్రింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థ, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతనని స్పష్టం చేసింది. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి తగిన సేవలందిస్తున్నాం. ప్రమాదానికి గల కారణంపై లోతుగా విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటాం అని అధికార ప్రతినిధి ప్రకటించారు.
మళ్లీ విమాన సేవలు ప్రారంభం
ఈ ఘటన తర్వాత ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాల ద్వారా.. టోక్యోకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మిగిలిన విమానాలు సాధారణంగా రాకపోకలు సాగిస్తున్నట్లు.. ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
Also Read: గాల్లో 900 అడుగుల కిందకు పడ్డ ఎయిర్ ఇండియా విమానం.. పైలట్‌కు సెల్యూట్
ఈ ఘటన మరోసారి విమానయాన సంస్థలు.. సాంకేతిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదం తప్పిపోయినప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగకుండా.. ముందు జాగ్రత్త చర్యలు మరింత కట్టుదిట్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
A #JapanAirlines #flight from #Shanghai to #Tokyo made an emergency landing at Kansai Airport last night after a cabin depressurization alert. The #Boeing 737-800, carrying 191 people, landed safely. No injuries reported. #China #Japan pic.twitter.com/wCneZ3nkk0
— Shanghai Daily (@shanghaidaily) July 1, 2025