BigTV English

OTT Movie : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ

OTT Movie : దెయ్యంతో పెళ్లి డీల్… ఫ్యామిలీలో వరుస హత్యలు… కలలో కూడా ఊహించని డేంజరస్ హర్రర్ స్టోరీ

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలలో వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి ప్రజలు కూడా పురాతన ఆచారాలు ఎక్కువగా పాటిస్తుంటారు. అందుకే ఈ ఇడస్ట్రీ నుంచి, చేతబడి, దెయ్యాల స్టోరీలతో సినిమాలు వస్తుంటాయి. ఓటీటీలోకి వస్తున్న ఈ హారర్ సినిమాలను ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక తల్లి, ఒక కుమార్తె, మధ్యలో దెయ్యం అన్నట్టుగా సాగుతుంది. ఇందులో దెయ్యంతో ఒక మహిళ చేసుకునే ఒప్పందం,  ఆ కుటుంబ నాశనానికి కారణం అవుతుంది. ఈ సినిమాని గుండె గట్టిగా ఉన్న వాళ్ళు చూస్తేనే బెట్టర్. ఎందుకంటే ఈ సీన్స్ అంత భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డెమన్స్ బ్రైడ్’ (The Demons Bride). 2025 లో వచ్చిన ఈ సినిమాకి అజర్ కినోయ్ లుబిస్ దర్శకత్వం వహించారు. ఇందులో టాస్క్య నమ్యా (రాంటి), వులాన్ గురిట్నో, షిండి హువాంగ్, ఎడ్వర్డ్ అక్బర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. 1 గంట 46 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDB లో 5.8/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

రాంటి తన కుమార్తె నినాను తన ప్రాణాంకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంటుంది. నినా పుట్టినప్పటినుంచే వికలాంగురాలు. నడవలేని స్థితిలో ఉంటుంది. రాంటి తన కుటుంబంతో (భర్త బోవో, సోదరి సిటి, అత్తగారు, బావమరిది) కలిసి ఒక గ్రౌండెడ్ జీవితాన్ని గడుపుతుంది. కానీ నినా పరిస్థితిని చూసి ఆమె ఆందోళన చెందుతూ ఉంటుంది. ఒక రోజు నినాకు ఒక ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. ఆమెకు వెంటనే చికిత్స చేయాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో, రాంటి తన కుమార్తెను రక్షించడానికి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఆమె ఒక దెయ్యంతో ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఒప్పందం నినా జీవితాన్ని కాపాడుతుంది. కానీ రాంటిలోకి దెయ్యం ఆవహిస్తుంది. ఆమె స్వభావం హఠాత్తుగా మారిపోతుంది.

దెయ్యం ప్రభావంతో, రాంటి హింసాత్మకంగా మారుతుంది. ఆమె తన కుటుంబ సభ్యులపై దాడులు చేస్తుంది. మొదట ఆమె సోదరి సిటిని, ఆ తర్వాత అత్తగారిని, బావమరిదిని, ఆమె భర్త బోవోను కూడా హతమారుస్తుంది. ఈ రక్తపాత సీన్స్ సినిమాలో భయంకరంగా ఉంటాయి. రాంటి మానవత్వం క్రమంగా కోల్పోతూ, పూర్తిగా దెయ్యం నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. ఈ హత్యల సమయంలో, రాంటి సన్నిహితురాలు గిటా,నినా మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. ఆ తరువాత క్లైమాక్స్ ఊహించని మలుపుతో దద్దరిల్లిపోతుంది. చివరికి ఆ దెయ్యం ప్రభావం వల్ల రాంటి ఏమౌతుంది ? నినాకి అంగవైకల్యం నుంచి కొలుకుంటుందా ? ఇంతకీ రాంటి దెయ్యం తో చేసుకున్న ఒప్పందం ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : భర్త ఉండగానే ఆఫీసులోనే కుర్రాడితో దుకాణం పెట్టే హీరోయిన్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Related News

Paradha Movie : ఆ ఓటీటీలోకి అనుపమ ‘పరదా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movie : సీక్రెట్ లవ్… ఒకడు ప్రేమిస్తే, పెళ్లి మరొకడితో… ఊహించని ట్విస్ట్ తో లైఫ్ నాశనం

OTT Movie : చచ్చిన 7 రోజుల తరువాత రీఎంట్రీ… అఘాయిత్యం చేసిన గ్యాంగ్ ను చచ్చినా వదలకుండా… బతికుండగానే నరకం

OTT Movie : పడుచు పిల్లతో పాడు పనులు… కల్లోనూ అదే యావ… మస్ట్ వాచ్ మలయాళ కాంట్రవర్సీ డ్రామా

OTT Movie : రక్తం ఏరులై పారే నది… అల్టిమేట్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ వయొలెన్స్… ఈ కన్నడ మూవీ మెంటల్ మాస్ మావా

OTT Movie : టీనేజ్ కూతురున్న తల్లిపై ప్రేమ… మనసుకు హత్తుకునే మలయాళ ఆంథాలజీ

Big Stories

×