Big Stories

JEE Main 2024 (Session 2) Result : జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో తెలుగు తేజాలు..

JEE Main 2024 Results : జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 రిజల్ట్స్ విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ రిజల్ట్స్ లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోర్ తెచ్చుకోగా.. వారిలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. వీరిలో 15 మంది తెలంగాణకు చెందినవారుండగా.. ఏడుగురు ఏపీ విద్యార్థులున్నారు.

- Advertisement -

ఏప్రిల్ 22నే జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫైనల్ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వెల్లడించాల్సిన తేదీ కంటే ఒకరోజు ముందుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫైనల్ రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్, సెక్యూరిటీ పిన్ నంబర్ ఎంటర్ చేయడంతో స్కోర్ కార్డుల్ని పొందవచ్చు. కాగా.. జేఈఈ మెయిన్ సెషన్ 1లో 23 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ సాధించగా.. వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

- Advertisement -

తెలంగాణకు చెందిన హందేకర్ విదిత్, ముత్తవరపు అనూప్, వెంకటసాయితేజ మదినేని, రెడ్డి అనిల్, రోహన్ సాయిబాబా, శ్రీయాశస్ మోహన్ కల్లూరి, కేసం చన్న బసవరెడ్డి, మురికినాటి సాయిదివ్య తేజరెడ్డి, రిషిశేఖర్ శుక్లా, తవ్వ దినేశ్ రెడ్డి, గంగ శ్రేయాస్, పొలిశెట్టి రితిష్ బాలాజీ, తమటం జయదేవ్ రెడ్డి, మావూరు జస్విత్, దొరిసాల శ్రీనివాసరెడ్డి 100 పర్సంటైల్ సాధించారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన చింటు సతీశ్ కుమార్, షేక్ సురజ్, మకినేని జిష్ణుసాయి, తోటంశెట్టి నిఖిలేష్, అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి, తోట సాయి కార్తీక్, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి 100 పర్సంటైల్ సాధించారు.

ఇక జేఈఈ మెయిన్స్ లో కటాఫ్ మార్కులొచ్చిన రెండున్నర లక్షల మంది విద్యార్థులకు అడ్వాన్స్ డ్ పరీక్ష రాసే వీలు కలుగనుంది. ఇందుకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు ఐఐటీ మద్రాస్ అప్లికేషన్లను స్వీకరించనుంది. మే 17 నుంచి 26 వరకూ అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ -2 పరీక్ష జరుగుతాయి. వీటి ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 9న ప్రకటిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News