Big Stories

Sam Pitroda Comments: పాలిటిక్స్‌లో పిట్రోడా పెట్రోల్..

Sam Pitroda’s ‘Inheritance Tax’ Remarks(Telugu flash news): సంక్షోభంలో సక్సెస్ వెతుక్కుంటారని మనం వాళ్ల పేర్లు.. వీళ్ల పేర్లు చెబుతాం కానీ. ఇలాంటి వాటిలో మొదటి వరుసలో ఉండేది మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకీ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందంటే విపక్షాల తప్పటడుగులను అనుకూలంగా మలుచుకుంటూ అధికారపీఠం వైపు అడుగులు వేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మరి కాకపోతే ఏంటండి ఇది..? ఆయన ఏం మాట్లాడారో మీరూ వినండి.. మధ్య తరగతి ప్రజలపై పన్నులు విధించాలని కొంత కాలం కిందట శ్యాంపిట్రోడా చెప్పారు. ఇప్పుడేమో వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని చెబుతోంది.
అంటే ఇక పెద్ద వాళ్ల సంపద.. వారి పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా వారి డబ్బును దోచుకోవడం కాంగ్రెస్ పార్టీ సూత్రం. ఇలా చెప్పుకుంటూ పోయారు మోడీ.

అయితే ఈ వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంపిట్రోడా..కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై మాట్లాడాలి అని మీడియా రిక్వెస్ట్ చేస్తే ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. అమెరికాలో ఇన్‌హెరిటెన్స్ టాక్స్‌ ఉంటుంది. ఓ వ్యక్తి వంద మిలియన్ డాలర్ల సంపద ఉందనుకుండే అతను మరణిస్తే 55 శాతం ప్రభుత్వానికి వెలుతుంది. మిగతా 45 శాతం మాత్రమే అతని కుటుంబానికి చెందుతుంది. ఇండియాలో ఇలాంటి చట్టం లేదు.అందుకే సంపదను తిరిగి పంపిణీ చేయాలన్న చర్చ నడుస్తుందన్నారు. ఇదే శ్యాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు. ఇంకేముంది ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు బీజేపీ నేతలు.

- Advertisement -

Also Read: పతంజలి ఓకే.. మిగిలినవాటి సంగతేంటి?

- Advertisement -

బీజేపీ నేతలంతా ఒకెత్తు అయితే.. ప్రధాని మోడీ మరో ఎత్తు.. గత కొన్ని రోజులుగా ఆయన చేసే ప్రసంగాలు కొత్త రూట్‌లో వెళుతున్నాయి. మొన్న మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుంటారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న మోడీకి ఇప్పుడు శాంపిట్రోడా వ్యాఖ్యలు మరింత బూస్ట్‌ను ఇచ్చాయి. ఇప్పటికే విన్నాం కదా చత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన సభలో మోడీ ఏం మాట్లాడారో విపక్ష నేతలు చేసే ఇలాంటి వ్యాఖ్యలను అనుకూలంగా మలుచుకోవడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఇప్పుడే కాదు గతంలో కూడా మణిశంకర్ అయ్యర్‌ కూడా పాకిస్థాన్‌ ప్రజల గురించి కొంచెం పాజిటివ్‌గా మాట్లాడితే.. దానిని తన ప్రచారస్త్రంగా వాడుకున్నారు. అంతకుముందు సోనియాగాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇదే చేశారు మోడీ. అంటే విపక్ష నేతలు ఇలా తెలిసి తెలియక చేసిన వ్యాఖ్యలను తన అస్త్రంగా మలుచుకోవడంలో మోడీ దిట్ట.. ఈసారి కూడా ఇదే జరిగింది.

అయితే శాంపిట్రోడా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారన్నారు ఆయన ఓ సెక్షన్ మీడియా, బీజేపీ నేతలు కావాలనే తన వ్యాఖ్యలను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటున్నారని చెప్పారు. మోడీ చేసిన వివాదస్పద వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే కుట్రలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు అమెరికాలో అలాంటి చట్టం ఉన్న మాట వాస్తవమే అని దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నానని ఇది ఓ టాపిక్‌పై చర్చ మాత్రమే అని దీనికి కాంగ్రెస్‌ పార్టీ పాలసీకి ఎలాంటి సంబంధం లేదన్నారు పిట్రోడా.. అంతేకాదు.. 55 శాతం ఆస్తి లాక్కుంటామని కాంగ్రెస్ చెప్పిందా? ఇలాంటి చట్టాన్ని ఇండియాలో తీసుకొస్తామనా కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందా? బీజేపీ, మీడియా ఎందుకు ఇంత హడావుడి చేస్తుందని ఆయన ఎదురు ప్రశ్నించారు..

ఆయన ఎంత క్లారిఫై చేసినా.. ప్రస్తుతం ఇండియన్‌ పాలిటిక్స్‌లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పట్లో ఈ టాపిక్‌పై డిబెట్‌కు ఫుల్ స్టాప్‌ పడటం కష్టమే అని చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News