Jaggery: మన తినే ఆహారంలో బెల్లం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది స్వీట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఆయుర్వేదంలో కూడా బెల్లం శరీరాన్ని జీవక్రియను మెరుగుపరచడానికి ,రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడింది. మీరు కూడా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, భోజనం తర్వాత బెల్లం తినడం అలవాటు చేసుకోండి. దాని అద్భుతమైన ప్రయోజనాలను పొందండి.
భోజనం చేసిన వెంటనే బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే సహజ ఫైబర్ , ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అసిడిటీ వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
2. కొన్ని సార్లు భోజనం తిన్న తర్వాత గుండెల్లో మంట, గ్యాస్ లేదా అసిడిటీతో బాధపడుతుంటే మాత్రం ఇందుకు బెల్లం సహజ పరిష్కారం. ఇది జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది . అంతే కాకుండా గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది.
3. బెల్లం శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలేయం , జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. భోజనం తర్వాత క్రమం తప్పకుండా చిన్న బెల్లం ముక్క తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగిస్తుంది. అంతే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
మీకు మలబద్ధకం సమస్య ఉంటే గనక తిన్న తర్వాత ఖచ్చితంగా బెల్లం తినండి. దీనిలో ఉండే సహజ లక్షణాలు ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తాయి.
4. బెల్లం ఇనుముకు మంచి మూలం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు , రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా బెల్లం తినాలి.
5. బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది . అంతే కాకుండా గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా బెల్లం తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షించడంలో కూడా బెల్లం ఉపయోగపడుతుంది.
బెల్లం తినడానికి సరైన మార్గం:
భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినండి. సోంపు లేదా అల్లంతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మరింత మెరుగుపడుతుంది. దీన్ని వేడి పాలు లేదా గోరువెచ్చని నీటితో తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి !
బెల్లం స్వీట్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్- ఆమ్లతను తగ్గించడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్నా అంతే కాకుండా పోషకాలు శరీరానికి అందాలన్నా భోజనం తర్వాత బెల్లం తినడం అలవాటు చేసుకోండి.