Manmohan Verdict: బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధానీ మన్మోహన్ సింగ్ కు సీబీఐ కోర్టు ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. అంతేకాకుండా ఆ క్రిమినల్ కేసును శాశ్వతంగా క్లోజ్ చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే మన్మోహన్ సింగ్ 2024లోనే మరణించగా.. అది జరిగిన రెండేళ్లకు సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు దేశవ్యాపంగా చర్చను లేవనెత్తింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన రెండేళ్ల తర్వాత బొగ్గు కేటాయింపుల కేసులో తీర్పు వెలువడటంపై రాజ్ దీప్ సర్దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024లో కన్నుమూశారు. ఆయన మరణించిన దాదాపు రెండేళ్ల తర్వాత బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్‌ను ఆమోదించింది. దీంతో యూపీఏ హయాం నాటి మరొక సంచలనాత్మక కేసు క్లోజ్ అయింది’ అని ఆయన రాసుకొచ్చారు.
NOTE: India’s ‘JUSTICE’ system is beyond repair. Dr Manmohan Singh died in 2024. Nearly two years later, the Supreme Court sets aside the trial court order summoning him in the Coal Block case and accepts the CBI clean chit! Yet another UPA era case is CLOSED!
Justice delayed… https://t.co/MQ2yJI6kUL— Rajdeep Sardesai (@sardesairajdeep) July 29, 2026
ఈ పోస్టులోనే ఆయన మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఆలస్యమైన న్యాయం.. న్యాయాన్ని తిరస్కరించడంతో సమానం. కానీ ఇక్కడ ఆ న్యాయాన్ని స్వీకరించడానికి బాధితుడు బతికిలేరు’ అంటూ రాజ్ దీప్ న్యాయ వ్యవస్థకు చురకలు అంటించారు. కోర్టు తీర్పుల జాప్యంపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చను.. ఆయన పెట్టిన ఈ ట్వీట్ మరోమారు తెరపైకి తీసుకొచ్చినట్లైంది. బతికున్నంత కాలం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి.. చనిపోయిన తర్వాత క్లీన్ చీట్ ఇచ్చి ప్రయోజనం ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
ఇక కేసు విషయానికి వస్తే.. 2004-14 మధ్య పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేసిన సంగతి తెలిసిందే. అయితే 2005లో ఒడిశాలోని తలబీరా-II బొగ్గు బ్లాక్‌ను అక్రమంగా హిండాల్కో ఇండస్ట్రీస్‌కు కేటాయించారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. 2015లో ఈ ఆరోపణలు వెలుగుచూడటంతో మోదీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మన్మోహన్ సింగ్ తో పాటు పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్ లతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది.
Also Read: ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!
అయితే ఈ సమన్లను సవాలు చేస్తూ మన్మోహన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లోనే ఈ సమన్లపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం పాటు.. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసు కొనసాగుతున్న క్రమంలోనే 2024 డిసెంబర్ 26న మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఇవాళ (బుధవారం) కోర్టు ముందుకు మరోమారు విచారణకు రాగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మన్మోహన్ సింగ్ కు క్లీన్ చీట్ ఇస్తూ కేసును క్లోజ్ చేయడం గమనార్హం.
Also Read: తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?