E-Paper
Advertisement

భవిష్యత్తు నుంచి వచ్చిన సైబోర్గ్‌తో ప్రేమ.. చివరి ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

భవిష్యత్తు నుంచి వచ్చిన సైబోర్గ్‌తో ప్రేమ.. చివరి ట్విస్ట్ ఊహించలేరు భయ్యా
Advertisement

Japanese Sci Fi Romantic: ప్రేమకథలు చాలానే చూశాం. టైమ్ ట్రావెల్ సినిమాలు కూడా కొత్తేమీ కాదు. కానీ భవిష్యత్తు నుంచి ఓ రోబో గతంలోకి వచ్చి ఓ యువకుడి జీవితాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే ? ఆ రోబోతోనే అతడు ప్రేమలో పడితే ? సైన్స్, ప్రేమ, ఎమోషన్స్ ను అద్భుతంగా మేళవించిన జపనీస్ క్లాసిక్ చిత్రం ‘Cyborg She’. 2008లోనే విడుదలైన ఈ మూవీ ఇప్పుడు కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జిరో అనే కాలేజీ విద్యార్థి ఒంటరిగా ఉంటుంది. తన పుట్టినరోజు రోజున కూడా తనను గుర్తు చేసుకునే వారు ఎవరూ లేకపోవడంతో నిరాశగా షాపింగ్ మాల్‌కు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఒక అందమైన యువతి అతని జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ, జిరోకు ఆమెపై ఆసక్తి పెరుగుతుంది. ఆమె ఎంత అకస్మాత్తుగా అతని జీవితంలోకి వచ్చిందో, అంతే వేగంగా ఎలాంటి వివరాలు చెప్పకుండా అదృశ్యమవుతుంది. ఆ సంఘటనను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, సరిగ్గా ఏడాది తర్వాత అదే పుట్టినరోజు రోజున ఆమె మళ్లీ అతని ముందుకు వస్తుంది. అయితే ఈసారి ఆమె చెప్పిన విషయం జిరోను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Advertisement

తాను సాధారణ అమ్మాయి కాదని… భవిష్యత్తు నుంచి వచ్చిన సైబోర్గ్‌నని ఆమె చెబుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత జిరో జీవితంలో జరగబోయే ఘోర ప్రమాదాన్ని అడ్డుకోవడానికే తనను గతంలోకి పంపించారని వివరిస్తుంది. మొదట ఆమె మాటలను నమ్మని జిరో, ఆమె అసాధారణ శక్తులు చూసిన తర్వాత నిజం అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుంచి ఆమె జిరోతోనే ఉండడం మొదలు పెడుతుంది. అతనికి ఎదురయ్యే ప్రతి ప్రమాదం నుంచి కాపాడుతుంది. సాధారణ మనుషులకు సాధ్యం కాని వేగం, బలం, తెలివితో అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఆమె ఒక యంత్రం కావడంతో భావోద్వేగాలను బయట పెట్టదు. నవ్వినా, మాట్లాడినా, చేసిన ప్రతి పని తనకు ఇచ్చిన ప్రోగ్రామ్‌లో భాగంగానే కనిపిస్తుంది.

క్రమంగా జిరో మాత్రం ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించడం ప్రారంభిస్తాడు. కానీ తన ప్రేమకు ప్రతిస్పందన ఎప్పటికీ దొరకదని భావించి బాధ పడుతుంటాడు. మరోవైపు ఆమె కూడా తన బాధ్యతను మాత్రమే నెరవేర్చాలని ప్రయత్నిస్తుంది. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతున్న సమయంలో ఊహించని విపత్తు సంభవిస్తుంది. ఆ క్షణం నుంచి కథ పూర్తిగా మరో మలుపు తిరుగుతుంది. ప్రేమ, సైన్స్, టైమ్ ట్రావెల్… ఈ మూడింటి మధ్య ఉన్న బంధాన్ని దర్శకుడు ఎంతో భావోద్వేగంగా చూపిస్తాడు. చివరికి సైబోర్గ్ తన లక్ష్యాన్ని నెరవేర్చిందా ? జిరో భవిష్యత్తు నిజంగానే మారిందా ? ఇద్దరి ప్రేమ సుఖాంతం అయ్యిందా ? లేక కాలమే వారి ప్రేమను మరో పరీక్షకు గురి చేసిందా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాను వీక్షించాల్సిందే.

తెలుగులో అందుబాటులో ఉందా ?

Advertisement

జపనీస్ సై-ఫై రొమాంటిక్ డ్రామా ‘సైబోర్గ్ షి’లో హరుకా అయాసే, కైసుకే కోయిడే ప్రధాన పాత్రల్లో నటించారు. ‘My Sassy Girl’ దర్శకుడు క్వాక్ జే-యాంగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా Rakuten Vikiలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. ప్రేమకథలు, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగాలు సినిమా ముగిసిన తర్వాత కూడా చాలా సేపు మనసులో నిలిచిపోతాయి.

Read Also: ఆకాశం నుంచి కురిసే ఆసిడ్ వర్షం… చివరి వరకు టెన్షన్ పెట్టే సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×