Tanveer Ahmed On ICC Jay Shah: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( PAK VS ENG ), ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( AUS VS BAN) మధ్య టెస్ట్ సిరీస్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్ట్ సిరీస్ ఫినిష్ చేసుకుంది బంగ్లాదేశ్. ఇటు పాకిస్తాన్ మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన బంగ్లాదేశ్ మొదటి మ్యాచ్ లో విజయం సాధించి… రెండో మ్యాచ్ లో మాత్రం దారుణమైన ఓటమి చవి చూసింది. ఒకటిన్నర రోజుల్లోనే అక్కడ మ్యాచ్ ఫినిష్ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ కూడా రెండున్నర రోజుల్లోనే ఓడిపోయింది. అయితే ఈ రెండు సిరీస్ లపై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో పాకిస్తాన్ అలాగే అటు బంగ్లాదేశ్ ఓడిపోవాలని ICC బాస్ జై షా కుట్ర చేశాడని బాంబు పేల్చారు.
ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్… ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవాలని ఐసీసీ బాస్ జై షా కుట్రలు చేశాడని మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా కు లైన్ క్లియర్ అవుతుందని ఈ కుట్రలకు తెరలేపారని హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ఆస్ట్రేలియా పై తొలి టెస్ట్ లో అద్భుతంగా రానించి బంగ్లాదేశ్ గెలవగా.. రెండో టెస్టులో ఓడిపోయింది అన్నారు.
రెండో టెస్టులో కూడా బంగ్లాదేశ్ విజయం సాధించి ఉంటే…. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నుంచి తప్పుకునేదని వ్యాఖ్యానించారు. అలా జరగకుండా కావాలనే జై షా… మైదానాలను సిద్ధం చేశాడని బాంబు పేల్చాడు. ఇక ఇటు ఇంగ్లాండ్ గెలిస్తే టీమిండియా కు పెద్దగా ఒరిగేదేమీ లేకున్నా… పాకిస్తాన్ ఓటమిని కల్లారా చూడాలని ప్లాన్ చేశారని వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా టీ20లు, వన్డేలు ఓడిపోయిందని…అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయేలా జై షా ప్లాన్ చేసినట్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
టీమిండియాకు అనుకూలంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మారెందుకు గాను మైదానాలలో చిప్పులు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. శ్రీలంక బోర్డును కొనుగోలు చేసి… అక్కడ వాళ్ళ జట్టును టీమిండియా ఓడిస్తోందని బాంబు పేల్చారు. అదే సమయంలో ఆస్ట్రేలియా ఇటు ఇంగ్లాండ్ తో కలిసి ఐసీసీ పెద్ద స్కెచ్ వేసిందని సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ కు తీవ్ర నష్టం జరిగిందన్నారు.