E-Paper
Advertisement

ఐఫోన్, బైక్ కోసం.. ప్రియుడితో కలిసి తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక!

ఐఫోన్, బైక్ కోసం.. ప్రియుడితో కలిసి తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక!
Advertisement

Alappuzha Murder: కేరళలోని అలప్పుజ జిల్లాలో సమాజం తలదించుకునే అత్యంత దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. కేవలం ఒక ఐఫోన్, ఖరీదైన బైక్ ఆశ కోసం ఒక 13 ఏళ్ల బాలిక.. తన ప్రియుడు , అతని స్నేహితులతో కలిసి సొంత తాతనే దారుణంగా హత్య చేయించింది.

హత్యకు వ్యూహం.. నేరానికి వేదిక

Advertisement

అలప్పుజకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. గతంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడనే కోపంతో ఉన్న బాలిక, అతడిని మట్టుబెట్టాలని తన ప్రియుడికి చెప్పింది. దీనికి తోడు ఇంట్లోని బంగారాన్ని దోచుకుని, ఆ డబ్బుతో తనకు ఐఫోన్, ప్రియుడికి బైక్ కొనాలని ప్లాన్ వేశారు.

లైవ్ వీడియో కాల్‌తో రాక్షసానందం

Advertisement

ప్లాన్ ప్రకారం ప్రియుడు, మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి రాత్రి వేళ ఇంట్లోకి జొరబడ్డాడు. ఇద్దరు వెంటిలేటర్ ద్వారా, మరొకరు మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్లి వృద్ధుడిని గట్టిగా కట్టేసి, విచక్షణారహితంగా కొట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఈ దారుణం జరుగుతున్నంత సేపు నిందితులు బాలికకు వీడియో కాల్ చేసి లైవ్‌లో చూపించడం గమనార్హం.

పోలీసుల దర్యాప్తు.. నిందితుల అరెస్ట్

హత్య అనంతరం ఇంట్లోని సుమారు 4 తులాల బంగారాన్ని దొంగిలించి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగి, బాలికతో పాటు ఆమె ప్రియుడు, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. మోజుల కోసం సొంత రక్తాన్నే బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!

Tags

Related News

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

Big Stories

Advertisement
×