Big Stories

Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు బెయిల్..

Bail to Rahul Gandhi:

- Advertisement -

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి కాస్త ఉపశమనం లభించింది. పరువు నష్టం కేసులో యూపీ సుల్తాన్‌పుర్‌ జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. భారత్‌ జోడో న్యాయ యాత్రలో ప్రస్తుతం యూపీలోనే ఉన్న రాహుల్ కేసు విచారణకు హాజరయ్యారు.

- Advertisement -

2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ అమిత్‌ షాను ఉద్దేశించి విమర్శలు చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయతీగా ఉంటామని చెప్పే బీజేపీ.. ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించిందని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. వివాదం రేగింది.

Read More: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం!

మరోవైపు రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. గత నెలలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గోహతిలో జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో రాహుల్‌ గాంధీని విచారించేందుకు సీఐడీ ఈ సమన్లు జారీ చేసింది.

ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్ సీనియర్‌ నేతలు జితేంద్ర సింగ్‌, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, కన్హయ్య కుమార్‌, శ్రీనివాస్‌ బీవీ, భూపేన్‌ కుమార్ బోరా, గౌరవ్‌ గొగొయ్‌, దేబబ్రత సైకియా పేర్లు కూడా ఉన్నాయి. వారిలో కొందరికి అస్సాం సీఐడీ నోటీసులు ఇచ్చింది.

సోమవారం అస్సాం ఎమ్యెల్యే జాకీర్‌ హుస్సేన్‌ సిక్దార్‌కు, మరో పార్టీ నేతకు కూడా సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. గోహతి నగర కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రామన్‌ కుమార్‌ శర్మను ఫిబ్రవరి 23న సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News