Maoist Encounter: జార్ఖండ్‌లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో…కోబ్రా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. లుగు కొండల్లో మావోయిస్టులు ఎదురు పడటంతో…ఇరు వర్గాల మధ్య బీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు ఎస్కేప్ అవ్వడంతో….కూంబింగ్ చేపట్టారు.
గత కొన్నిరోజులుగా.. ఛత్తీస్‌గఢ్ అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయ్. ఆపరేషన్ కగార్‌లో భాగంగా…మావోయిస్టులను ఏరివేస్తున్నారు. దాంతో మావోయిస్టులు అబూజ్‌మడ్ వీడి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఘటన స్థలానికి డీఐజీ సురేంద్ర కుమార్, ఎస్పీ స్వర్గియారీ ఇతర అధికారులు నేతృత్వం వహిస్తు్న్నారు. ఈ ఎన్ కౌంటర్ 209 కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, జార్ఖండ్ జాగ్వార్, సీఆర్‌పీఎఫ్ సైనికులు జాయింట్ ఆపరేషన్ అని అధికారులు తెలిపారు.
Also Read: మెరుపు వరదలు.. 40 ఇళ్లు ధ్వంసం ఎంత మంది చనిపోయారంటే
గ్రామాస్తులు తెలిపిస వివరాల ప్రకారం.. లుగు పర్వతం దిగువన ఉనన చోర్గావ్ ముండటోలి సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దం విని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచినట్లు సమాచారం అందించారు. బయటకు వచ్చేసరికి చుట్టుపక్కల పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. గత కొంత కాలంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించే పనిలో పడ్డారు పోలీసులు.