SriNidhi Shetty:శ్రీనిధి శెట్టి ,(SriNidhi Shetty) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒక సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ హీరో యష్ (Yash) నటించిన ‘కేజిఎఫ్’ చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఇప్పుడు ‘హిట్ ‘ యూనివర్స్ లోకి అడుగు పెట్టింది. తాజాగా హిట్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘హిట్ 3’. ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో నాని (Nani) హీరోగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్, ట్రైలర్ అన్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇందులో నాని నటనను చూసి అభిమానులు సైతం భయపడిపోతున్నారు. ఇక ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి అవకాశాన్ని అందుకుంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
నాని అంటే ఒక బ్రాండ్.. అందుకే ఆయన సినిమాలో ఒప్పుకున్నాను..
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ ..” హిట్ 3 స్క్రిప్టు నా దగ్గరకు రాగానే నేను క్షణం ఆలోచించకుండా అంగీకరించాను. ఎందుకంటే నాని అంటే ఒక పేరు కాదు అదొక బ్రాండ్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ఇక ఎలాంటి ప్రశ్నలు అడగకుండా అంగీకరించాను. అయితే ఇందులో నేను ఆయనకు భార్యగా కనిపించనున్నాను. నేను ఇప్పటివరకు సినిమా నుండి విడుదల చేసిన ప్రోమోలలో ఎక్కువగా కనిపించలేదు. కానీ నా పాత్ర ఈ సినిమాలో చాలా శక్తివంతమైనది” అంటూ శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. ఇక ఇందులో నాని అర్జున్ సర్కార్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర బృందం అందులో భాగంగానే సోమవారం ముంబై వెళ్ళిన నాని మూడు రోజులపాటు అక్కడే మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా విశేషాలను పంచుకోబోతున్నారు.
ప్రీ బుకింగ్స్ సేల్ లో సత్తా చాటిన హిట్ 3..
ఇప్పటికే నాని నటించిన ఎన్నో సినిమాలు అటు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుకోగా.. ఇప్పుడు హిట్ 3 కూడా ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ టికెట్లు కూడా చాలా బాగా అమ్ముడుపోయాయి. ఒక్కరోజులోనే 75 వేల డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. దీంతో తక్కువ సమయంలోనే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరడం ఖాయమని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా నాని ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కొచ్చి ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ను ఏర్పరచుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
Also Read:Aishwarya – Abhishek: ఒక్క ఫోటోతో విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టిన బాలీవుడ్ జంట.. కూతురితో కలిసి..!