CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
తాజా రాజకీయ పరిస్థితుల గురించి హోం మంత్రి అమిత్ షాతో చర్చించామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని ల్యాండ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించామని సీఎం పేర్కొన్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నామని.. ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.30,000 వరకు జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా..
గుజరాత్ రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలైందని అన్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చెప్పారు. అసలు రాష్ట్రంలో గంజాయి అనే మాట వినిపించకుండా చేసి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక నేరాలపై, కబ్జాదారులపై పీడీ కేసులు పెడతామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు త్వరలోనే మరో బిల్లు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
వైసీపీ హయాంలో గడిచిన ఐదేళ్లలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పారు. వైసీపీ హయాంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగాయని అన్నారు. వాళ్లకు ఐదేళ్లు రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.10 లక్షల కోట్ల అప్పులు సహా బకాయిలు మిగిల్చారన్నారు. గతంలో FRBM పరిమితులు కూడా దాటిపోయారని చెప్పారు. రాష్ట్రంలో 12.94 శాతం వృద్ధి రేటు సామర్థ్యం కాగా.. ఈ ఏడాది 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధానంపై కేంద్ర మంత్రులతో చర్చించామని పేర్కన్నారు.
ALSO READ: AAI Recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. మరి ఇంకెందుకు ఆలస్యం..
‘వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా.. నదుల అనుసంధానం జరిగితే రాయలసీమకు ప్రయోజనం చేకూరనుంది. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టుకు వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సంపద సృష్టించలేని వారికి పంపిణీ చేసే హక్కు కూడా అసలు లేదు. 57 శాతం ఓటుబ్యాంకు, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. గడిచిన ఐదేళ్లలో భూ సంబంధిత చాలా వచ్చాయి. న్యాయస్థానాల్లో పిటిషన్లు, భూ కబ్జా వ్యవహారాలు అతిపెద్ద సమస్యగా మారింది’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.