E-Paper
Advertisement

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
Advertisement

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియాను, గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడే హక్కు అమిత్ షాకు లేదని మండిపడ్డారు. గోవాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన ఖర్గే.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అమిత్ షా చిన్నపిల్లవాడని వ్యాఖ్యానించారు. అలాంటిది ఈరోజు ఆయన తమకు దేశభక్తి పాఠాలు చెబుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.

వ్యాఖ్యలకు నేపథ్యం..

ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గీతాన్ని సోనియా గాంధీ మధ్యలోనే ఆపివేశారంటూ అమిత్ షా ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వందేమాతరం గీతం పూర్తిగా ఆలపించారని సోనియా గాంధీ కేవలం ఖర్గే కూర్చోవడానికి కుర్చీ ఇవ్వాలని కోరారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనల ప్రకారమే వందేమాతరం మొదటి రెండు చరణాలను పాడటం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేసింది. కాగా అదే రోజున పంద్రాగస్టు ఎర్రకోటపై వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు.

దేశభక్తిపై ఖర్గే ప్రశ్నాస్త్రాలు

Advertisement

అయితే వివాదంపై బీజేపీ విమర్శలు కొనసాగిస్తుండటంతో తాజాగా ఖర్గే తీవ్ర స్థాయిలో స్పందించారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏంటని ప్రశ్నించారు. ‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తం చిందించారు. మరి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఏ ఒక్క వ్యక్తి అయినా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా? ఏ హక్కుతో మీరు మాకు దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారు?’ అని నిలదీశారు. బీజేపీకి కాంగ్రెస్ దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

Also Read: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రత్యామ్నాయ మార్గాల పిటిషన్ కొట్టివేత

‘శుద్ధీకరణ’ ఘటనపై తీవ్ర ఆగ్రహం

Advertisement

ఈ నెల ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో తాను ప్రసంగించిన తర్వాత ‘శుద్ధీకరణ’ అక్కడ శుద్దీకరణ కార్యక్రమం నిర్వహించడంపై ఖర్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దళితుడైన తన సభా స్థలాన్ని శుద్ధి చేయడం దేశానికే అవమానకరమని మండిపడ్డారు. ‘మీ మతం ఇదే నేర్పుతోందా? మీ గురువులు ఇదే నేర్పారా? అసలైన పాపులు మీరే. ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఇది దురదృష్టకరమని, ఇందులో బీజేపీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×